అయేషా హత్యకేసు మళ్లీ మొదటికి.?

అయేషా మీరా కేసు.. ఎప్పటినుంచో చిక్కు వీడని ఈ కేసులో ఎన్న అనుమానాలు. మంత్రి మనవడే రేప్ చేశాడని చంపాడని.. అన్యాయంగా అమయాకుడైన సత్యంబాబును కొన్ని సంవత్సరాలు జైలు పాలు చేశారని.. స్వయంగా అయేషా మీరా తల్లిదండ్రులే ఆరోపించారు. చిల్లర దొంగ సత్యంబాబును సాక్షాలు లేకున్నా పోలీసులు ఈ కేసులో ఇరికించారని ఇటీవలే కోర్టు అతడిని నిర్దోషిగా విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఈ కేసులో మంత్రి మనవడే సూత్రధారని ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే..

హైకోర్టు సత్యంబాబును నిర్ధోషిగా విడుదల చేయడంతో ఇప్పుడు అసలు దోషిని పట్టుకునే పనిలో పడింది ఏపీ ప్రభుత్వం. అయేషా కేసును మళ్లీ దర్యాప్తు చేయాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. ఈ టీమ్ లో మహిళా పోలీసులు అధికారులు కూడా ఉన్నారు. విజయవాడ కమిషనర్ ఈ సిట్ ను పర్యవేక్షిస్తారు.

2007 డిసెంబర్ 26 న అయేషా మీరాను ఎవరో గుర్తు తెలియని దుండగుడు రేప్ చేసి కిరాతకరంగా చంపేశాడు. ఈ ఏడాది మార్చి దోషిగా భావించి పోలీసులు జైలుకు పంపిన సత్యంబాబును నిర్ధోషిగా పేర్కొంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో పదేళ్ల క్రితం కనుమరుగైన సాక్ష్యాలను ఈ సిట్ ఎలా వెలుగులోకి తీస్తుంది.? అసలు దర్యాప్తులో క్లూలేని ఈ కేసులో ఎలా ముందుకు వెళ్తారనే ప్రశ్న అందరిలోనూ ఉదయిస్తోంది. ఈ కేసును మళ్లీ దర్యాప్తు చేసినా సాక్ష్యాలు దొరకవని.. ఆ నాటి ప్రభుత్వ పెద్దలు మంత్రి మనవడిని కాపాడడానికి ఎక్కడా సాక్ష్యాలు లేకుండా జాగ్రత్త పడ్డారనే విమర్శలున్నాయి. దీంతో ఈ కేసులు తేలడం అసాధ్యమే.. అయేషా మీరా తల్లిదండ్రులకు న్యాయం జరగడం కల్లే..

To Top

Send this to a friend