తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కి చుక్కలు చూపించనున్న సీమాంధ్రులు

తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ ఏడో తారీఖున జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో సీమాంధ్రులు పెద్దఎత్తున తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయం ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. తెలంగాణలో ఉన్న సెటిలర్స్ మనోభావాలు పూర్తిగా ఏప్పీ ప్రజల మనోభావాలని ప్రతిబింబిస్తాయనటం జగమెరిగిన సత్యం.

బెడిసికొట్టిననున్న కాంగ్రెస్ తెదేపా మైత్రీ బంధం
తెలుగుదేశం పార్టీ పుట్టుక కారణం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పట్ల అనుసరించిన దురహంకార వైఖరి. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు జీవించినంత కాలం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేశారు. నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం అదే బంధాన్ని కొనసాగించింది. అయితే రాష్ట్రంలో మసకబారిన తెలుగుదేశం పరపతి ప్రతిష్ట నిలబెట్టుకునేందుకు తెలుగుదేశానికి రాష్ట్రంలో ఒక బలమైన దన్ను అవసరం. హోదా ఇవ్వని కారణంగా బిజేపి పై తీవ్ర వ్యతిరేకత ఉన్నది. గత ఎన్నికలలో భుజమొడ్ఠి గెలిపించిన పవన్ కళ్యాణ్ నేడు కొరకరాని కొయ్యగా మారాడు. జగన్ పై వ్యతిరేకత ఉండనే ఉన్నది. ఈ పరిస్థితిలో గత్యంతరం లేక కాంగ్రెస్ కాళ్ళబేరానికి చంద్రబాబు నాయుడు వెళ్ళారనేది అందరికీ అర్థమైన విషయం. అయితే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే బదులు ప్రతిపక్షంలో ఉండటమే నయమని 80 శాతం తెలుగుదేశం పార్టీ అభిమానులు భావిస్తున్నారు. కాంగ్రెస్ తో పొత్తు కంటే స్వయంగా పోటీ చేసి ఓటమి కి ఎదుర్కొని నిలబడితే స్వీయ గౌరవం నిలబడుతుందని లేకపోతే అధికారం కోసం నానా గడ్డి తినే పార్టీగా తెలుగుదేశం పార్టీ అధికారం కోసం దిగజారి రాజకీయాలు చేశారని చంద్రబాబు నాయుడు స్వభావం మరోసారి రుజువు ప్రజలలో తలెత్తుకోలేని అవమానకర పరిస్థితుల్లో పార్టీ అభిమానులు ఉంటారని వారు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తో పొత్తు ఉండకూడదు అంటే తెలంగాణలో ఆ పొత్తుని నిర్దయగా తోసిపుచ్చాలని ఆత్మాభిమానం గల తెదేపా కార్యకర్తలు మరియు ఎన్టీఆర్ పై అభిమానంతో పార్టీతో ఉన్నవారు భావిస్తున్నారు.

 

To Top

Send this to a friend