అందిరిలోనూ డిప్రెషన్ ఎందుకలా..?


దేశంలోని యువతపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన సర్వే గుబులు రేపుతోంది. దేశంలోని యువతలో తీవ్ర కుంగుబాటు ఉందన్న విషయం విస్మయం కలుగుతోంది. ముఖ్యంగా 13-15 ఏళ్ల వయసు ఉన్న బాలురుల్లో ప్రతి నలుగురిలో ఒకరికి కుంగుబాటు ఉందని తేల్చింది. 15-29 మధ్య వాళ్లలో ఆత్మహత్యలు పెరగడానికి డిప్రెషన్ కారణమని తేల్చింది.

దేశంలో యువత వైఖరి మారింది. సినిమాలు, సీరియళ్లు వారిని నాశనం చేస్తున్నాయి. వాటి మాయలో పడి స్కూలు వయసులోనే చెడు వ్యసనాలకు యువత అలవాటు పడుతోంది.

పదేళ్ల క్రితం వరకు ముఖ్యంగా సెల్ ఫోన్లు లేనంత వరకు యువకులు బాగా చదివారు. ఎప్పుడైతే సెల్ ఫోన్ అరచేతిలోకి వచ్చిందో అప్పటినుంచే యువతలో పెను మార్పులకు కారణమైంది. సోషల్ మీడియా విద్యార్థుల చదువులకు దూరం చేసింది. ఫేస్ బుక్, వాట్సాప్ ల వల్ల విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతింటోంది. అందుకే ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారు రాష్ట్రపతి అవుతుంటే.. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదివిన వారు పదోతరగతి గట్టెక్కడం లేదు. టెక్నాలజీ తెచ్చిన ఈ దెబ్బకు యువత పెడదోవ పడుతోంది. డిపెష్రన్ కు గురవుతోంది. మద్యం సిగరేట్ కు అలవాటు పడి భవిత నాశనం అవుతోంది. చదువులు అటకెక్కుతున్నాయి.

To Top

Send this to a friend