కేసుతో జైలుకు వెళ్లిన యాంకర్‌


ప్రస్తుతం బుల్లి తెరపై దుమ్ము రేపుతున్న యాంకర్స్‌లో ప్రదీప్‌ ఒకడు. పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ, సొంతంగా కూడా ప్రొడక్షన్‌ హౌస్‌ ఉన్న ప్రదీప్‌ తాజాగా ఒక కేసు విషయంలో చంచల్‌గూడ జైలుకు వెళ్లాడు. ఒక చెక్‌ బౌన్స్‌ కేసులో ప్రదీప్‌ అరెస్ట్‌ అయ్యాడు. చాలా రోజుల క్రితం ఒక వ్యక్తికి ప్రదీప్‌ చెక్‌ ఇవ్వడం జరిగింది. ఆ చెక్‌ బౌన్స్‌ అవ్వడంతో సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు ప్రదీప్‌ను అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరు పర్చారు.

కోర్టు ప్రదీప్‌కు రిమాండ్‌ విధించడం జరిగింది. దాంతో పోలీసులు ప్రదీప్‌ను చంచల్‌గూడ జైలకు తరలించారు. చంచల్‌గూడ జైలుకు వెళ్లాడో లేదో వెంటనే ప్రదీప్‌ తరపు న్యాయవాది బెయిల్‌ తీసుకు వచ్చారు. దాంతో అదే రోజు కొన్ని గంటల తర్వాత చంచల్‌ గూడ జైలు నుండి ప్రదీప్‌ బయటకు వచ్చాడు. ప్రదీప్‌ జైలుకు వెళ్లాడు అనే విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు బుల్లి తెర వర్గాల్లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. అయితే ప్రదీప్‌ చెక్‌ ఇచ్చింది ఎవరికి, ఎందుకు బౌన్స్‌ అయ్యింది అనే విషయాలు మాత్రం తెలియరాలేదు.

To Top

Send this to a friend