మళ్లీ సుమతో ఢీ కి ప్రయత్నం


బుల్లి తెరపై ప్రస్తుతం యాంకర్‌ సుమ ఏ స్థాయిలో  ఊపేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక అనసూయ, రష్మీ, శ్రీముఖిలు తమ అందాలతో యాంకర్‌లుగా దుమ్ములేపుతున్నారు. వీరందరు రాకముందు బుల్లి తెరపై యాంకర్‌గా ఉదయభాను ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లి తెరపై యాంకర్‌ అనే పదాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది ఉదయభాను అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

పలువురు యాంకర్‌లు రావడంతో ఉదయభాను ప్రాభవం కోల్పోయింది. దానికి తోడు వివాదాలు కూడా ఆమె కెరీర్‌ను నాశనం చేస్తున్నాడు. తాజాగా కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉదయభాను మళ్లీ బుల్లి తెరపై సందడికి సిద్దం అయ్యింది. తాజాగా మెగా మూవీ నక్షత్రం ఆడియో విడుదల కార్యక్రమంకు హోస్ట్‌గా వ్యవహరించింది. ఆ షోను చాలా పద్దతిగా, చక్కగా భాను కొనసాగించింది.

గతంలో మాదిరిగా కాకుండా భానులో ప్రస్తుతం చాలా మెచ్యూరిటీ కనిపిస్తుంది. హుందాగా ఆమె మాట్లాడటంతో పాటు, డ్రస్సింగ్‌ కూడా హుందాగా అనిపిస్తుంది. దాంతో ఉదయభాను మళ్లీ యాంకరింగ్‌లో సుమతో ఢీ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఒక బుల్లి తెరపై షోను చేస్తుంది. ఆ షో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బుల్లి తెరపై మళ్లీ భాను బిజీ కావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

To Top

Send this to a friend