సుమ కూడా బూతు మొదలెడుతుంది

ఈటీవీ ప్రస్తుతం బూతు కామెడీపై నడుస్తుంది. జబర్దస్త్‌, పటాస్‌ ఇంకా ఈటీవీ ప్లస్‌లో ప్రసారం అవుతున్న పలు కామెడీ షోలు బూతుతో నడుస్తున్నవే. బూతు వల్లే కామెడీ వస్తుందని నమ్ముతున్న ఈ కాలంలో తప్పనిసరి పరిస్థితుల్లో కామెడీ కోసం బూతును ఆశ్రయిస్తున్నట్లుగా కార్యక్రమ నిర్వహకులు మరియు కార్యక్రమంలో నటించే వారు, హోస్ట్‌లు కూడా అంటున్నారు. యాంకర్స్‌ ఇప్పటికే బూతు పంచాంగం మొదలు పెట్టారు. అయితే అందుకు సుమ దూరం అని ఇంత కాలం అనుకున్నా.

తాజాగా సుమ కూడా బూతు మొదలు పెట్టింది. అందరితో పాటు నేను అనే ఉద్దేశ్యంతో సుమ తన షోల్లో డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌ మరియు బూతు పంచ్‌లను ఉపయోగిస్తుంది. సుమ ఈ మద్య చేస్తున్న పలు షోల్ల కూడా ఇలాంటి కామెడీ వస్తుండటంతో సుమ కూడా చెడిపోయింది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. యాంకర్‌గా ఎన్నో అద్బుతమైన కార్యక్రమాలు చేసి ఆకట్టుకున్న సుమ ఇప్పుడు బూతును ఆశ్రయించడంను తప్పుబడుతున్నారు.

సుమ తప్పేం లేదని, కార్యక్రమ నిర్వాహకులు ఆమెతో బూతు చేయిస్తున్నట్లుగా ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. సుమ ప్రస్తుతం నిర్వహిస్తున్న జీన్స్‌ కార్యక్రమం మల్లెమాల వారి కార్యక్రమం. మల్లెమాల వారికే చెందిన జబర్దస్త్‌, పటాస్‌ ఇంకా పలు షోల్లో బూతు పండి పోతుంది. అందుకే జీన్స్‌కు కూడా ఆ బూతును అంటించినట్లుగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

To Top

Send this to a friend