బుద్ది లేకుండా మాట్లాడి.. సారీ చెప్పనన్న రవి

ఆడవారిపై సీనియర్‌ నటుడు చలపతి రావు చేసిన వ్యాఖ్యల దుమారం కొనసాగుతుంది. తన వ్యాఖ్యలు దురదృష్టకరం అంటూ బహిరంగాంగా క్షమాపణలు చెప్పిన చపతి రావు, రాత పూర్వకంగా కూడా క్షమాపణలు చెప్పిన విషయం తెల్సిందే. ఆయన క్షమాపణలు చెప్పినా కూడా మహిళ సంఘాల నేతలు మాత్రం తగ్గేది లేదు, కేసు నమోదు చేయాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు. చలపతి రావుతో పాటు, ఆయన వ్యాఖ్యలను సూపర్‌ అంటూ ఉట్టంక్కించిన యాంకర్‌ రవిపై కూడా కేసు నమోదు చేయాలని మహిళ సంఘాల వారు డిమాండ్‌ చేస్తున్నారు.

తనపై వచ్చిన విమర్శలకు చలపతి రావు క్షమాపణలు చెప్పినా, రవి మాత్రం క్షమాపణలు చెప్పను అని, తాను క్షమాపణలు చెప్పేంతటి తప్పు చేయలేదు అంటున్నాడు. చలపతి రావు గారు ఏం అన్నారో నాకు వినిపించలేదు అని, ఆయితే ఆయన ఏదో పంచ్‌ వేసి ఉంటాడు అనే ఉద్దేశ్యంతో తాను సూపర్‌ అంటూ వ్యాఖ్య చేశాను అప్ప ఆడవారిని అవమానపర్చే ఉద్దేశ్యం తనకు మాత్రం లేదు అంటూ రవి చెప్పుకొచ్చాడు.

ఒక వీడియో బైట్‌ను విడుదల చేసిన రవి ఆ వీడియోలో తాను చేసింది తప్పే కాదు అంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. రవికి వినిపించి అన్నాడో లేక వినిపించకుండా అన్నాడో తర్వాత సంగతి, ఆయన వ్యాఖ్యల వల్ల మహిళ లోకం అంతా కూడా ఇబ్బంది పడ్డటం జరిగింది. అందుకు అయినా రవి క్షమాపణలు చెప్పాలిందని కొందరు అంటున్నారు. రవి ఇప్పటికైనా క్షమాపణలు చెప్పి తన హుందాతనంను నిలుపుకోవాలని ఆయన సన్నిహితులు కూడా అంటున్నారు.

To Top

Send this to a friend