‘నడుము’ వివాదంలో అనసూయ..

సాక్షి టీవీలో న్యూస్ ప్రజెంటర్ గా ఎంటర్ అయ్యి ఆ తరువాత ఈటీవీ జబర్దస్త్ తో ఓవర్ నైట్ ఫేమస్ అయిన బుల్లితెర యాంకర్ అనసూయ ఇప్పుడు సినిమాల్లోనూ నటిస్తూ చాలా అవకాశాలను దక్కించు కుంటోంది. గ్లామర్, అందం, చెలాకీతనం కలగలిసిన ఈ సుందరి హావభావాలు యువతను మత్తెక్కిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ మధ్య అనసూయ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త దుమారం రేపుతోంది..

అనసూయ చిట్టి నడుము లావైపోతోందట.. దాన్ని తగ్గించునేందుకు అనసూయ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోబోతోంది అన్నది ఆ వార్త సారాంశం. ఆపరేషన్ తో నడుము చుట్టు ఉన్న కొవ్వును తీయించుకుంటోంది.. అని వార్తలు వెలువడ్డాయి. రెండు మూడు రోజులుగా ఇవే వార్తలు సోషల్ మీడియాలో వివిధ వెబ్ సైట్లలో హోరెత్తుతున్నాయి. ఓ అభిమాని ఒకరు ఈ వార్తను అనసూయ ఫేస్ బుక్ కు అటాచ్ చేయడంతో ఈ వివాదంపై అనసూయ స్పందించింది.

‘వార్తలు లేనిదే వెబ్ సైట్లకు పూట గడవదు. ముఖ్యంగా సెలబ్రెటీల వార్తలంటే చెవి కోసికుంటారు. కానీ అనసూయ గురించి ఈ మధ్య వార్త లేకపోయేసరికి కొందరు నా నడుమును టార్గెట్ చేశారు. నడుము చుట్టుకొలత తగ్గించుకునేందుకు తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటున్నాననే ప్రచారం శుద్ధ అబద్ధం. నన్ను సంప్రదించకుండా ఇష్టమొచ్చినట్టు వార్తలు రాస్తున్నారు. అయినా అలాంటి కృత్రిమ అందాలను నేను నమ్ముకోను.. ఇప్పటికైనా వాస్తవాలు రాయండి’ అని అనసూయ హితబోద చేసింది. ఇలా అనసూయ నడుముపై వివాదం కొనసాగుతుండగా అనసూయ ఇచ్చిన క్లారిటీతో అంతా సమసిపోయింది.

To Top

Send this to a friend