అనసూయ ఆగ్రహం.. తెలిస్తే షాక్..

అనసూయ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తనపై కామెంట్ చేసి ఓ అభిమాని చెంప చెల్లుమనేలా సమాధానమిచ్చింది. అదిప్పుడు వైరల్ గా మారింది. ఇంతకీ అనసూయపై నెటిజన్ ఏం కామెంట్ చేశాడు..? అనసూయ ఏం కామెంట్ చేసిందో చూద్దాం..

‘నీకు ఏమైనా ఇంగితజ్ఞానం ఉందా అనసూయా.. ఎందుకలా ఎక్స్ పోజింగ్ చేస్తున్నావ్.. మేం ఫ్యామిలీతో కలిసి ప్రోగ్రామ్స్ చూడక్కర్లేదా..’ అని ఓ నెటిజన్ అనసూయ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఫొటో కింద కామెంట్ చేశాడు. ఆ పోస్టుపై అనసూయ ఘాటుగా స్పందించింది. తానొక మహిళనని.. తల్లినని,భార్యనని.. అలాంటి నా గురించి మాట్లాడే స్వేచ్ఛ నీకెవరిచ్చారంటూ అనసూయ నెటిజన్ కు కౌంటరిచ్చింది. తన ప్రోగ్రాం నచ్చకపోతే చానల్ మార్చుకునే ఆప్షన్ నీకుందని.. కుటుంబ విలువల పట్ల అంత ప్రేమ ఉన్న మీకు మీ భావాలను ఎదురివారి మీద రుద్దకూడదన్న సంగతి మీకు తెలియదా అని ప్రశ్నించింది. ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడమే తమ పని అని, తమ పరిధులు తెలుసని ఆమె చెప్పింది. ఎక్స్ పోజింగ్ ఇవ్వడం లేదని.. తాను ఏం ధరించాలో తన ఇష్టమని.. అలాంటివే ధరించాలనే ఆదేశించే హక్కు ఎవరికీ లేదని అనసూయ చెప్పింది.

ఎక్స్ పోజింగే లైంగిక దాడులకు కారణమైతే చిన్న పిల్లలు, వృద్ధులపై ఎందుకు అత్యాచారాలు జరుగుతున్నాయి అనసూయ ప్రశ్నించింది. ఇలా నెటిజన్ కు లాంగ్ రిప్లై ఇచ్చి అనసూయ గట్టి సమాధానమిచ్చింది. అనసూయ ఇంతలా రియాక్ట్ కావడం తాను ఇంతవరకు చూడడం లేదని కొందరు నెటిజన్లు కామెంట్ పెట్టడం గమనార్హం.

To Top

Send this to a friend