బూతును సమర్ధించుకుంటున్నఅనసూయ..

గత కొన్ని రోజులుగా జబర్దస్త్‌, పటాస్‌ వంటి షోల్లో బూతు కామెడీ ఎక్కువ అయ్యింది అంటూ విమర్శలు వస్తున్న విషయం తెల్సిందే. తాజాగా చలపతిరావు ఎపిసోడ్‌తో మరోసారి బుల్లి తెర కార్యక్రమాల బూతు కామెడీపై పలువురు సినీ ప్రముఖులు సైతం విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అనసూయ హోస్ట్‌గా చేస్తున్న ఒక షోపై కూడా విమర్శలు వస్తున్నాయి. తనపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చేందుకు అనసూయ సోషల్‌ మీడియా ముందుకు వచ్చింది.

అనసూయ ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతూ తాను ఈ విషయమై కాస్త ఇబ్బందిగా ఫీల్‌ అవుతున్నాను అని, అయితే ఇది నా ఒక్కదాని చేతిలో లేదు. మారడం అంటే మారొచ్చు. కాని మొత్తం మారితేనే నేను మారినప్పుడు విలువ ఉంటుంది. నేను చేయకుంటే మరొకరు ఇలాంటివే చేస్తారు. అలాంటప్పుడు నేను మానేసి ప్రయోజనం ఉండదు అంటూ చెప్పుకొచ్చింది.

ఇక తమ కార్యక్రమాల్లో బూతు గురించి ఆమె మాట్లాడుతూ ట్రైలర్‌లో చూపించేది ఒకటి ఉంటుంది, కార్యక్రమంలో మరోటి ఉంటుందని, కార్యక్రమంకు ఆడియన్స్‌ను అట్రాక్ట్‌ చేసేందుకు అలా చేస్తామని, అంతే తప్ప కార్యక్రమం మొత్తం బూతులతో నిడి ఉండదని చెప్పుకొచ్చింది. ట్రైలర్‌లో బూతు ఉన్నంత మాత్రానా కార్యక్రమంలో ఉంటుందని ఏమీ లేదని, కొన్ని సందర్బాల్లో ట్రైలర్‌లో బూతును సృష్టిస్తారని చెప్పుకొచ్చింది.

To Top

Send this to a friend