అనసూయ, ఆదిల బూతు పురాణం..


జబర్దస్త్ షోతో బూతుపురాణం మొదలైంది. స్కిట్ లలో రోమాంటిక్ సీన్లు, భర్త, భార్తలు, మహిళలను అవమానించేలా పదాలు, బూతు మాటలు ఎక్కువైపోయాయి. ఆ పరంపరగా జబర్దస్త్ షో తో పాటు ఈటీవీ2 పటాస్ కు ఇప్పుడు మిగతా చానళ్లకు పాకింది. బూతు, కాంట్రవర్సీ లేకుండా సదురు చానళ్లు షోలు చేయడం లేదు. అనసూయ వ్యాఖ్యాతగా ఓ చానెల్ లో వస్తోన్న షోకు బబర్దస్త్ ఫేం హైపర్ ఆది, రైజింగ్ రాజులు వచ్చారు. ఈ సందర్భంగా కామెడీ పండించడం కోసం హైపర్ ఆది, రాజులు అనసూయపై కామెంట్ చేశారు. ఆ కామెంట్లు తీవ్ర వివాదాస్పదమైంది. చివరకు అనసూయ ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చి వాటిపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

‘అనసూయ అది చూస్తే పడిపోతారు’ అని ఆది అనడం.. రాజును అనసూయ మూతి కడుగు అంటూ’ సెటైర్లు వేయడం వివాదాస్సదమైంది. అయితే సదురు చానల్ వీరిద్దరివి సీన్లు కట్ చేసి మరింత రోస్ట్ చేసి ప్రోమోను చానల్ లో ప్రసారం చేస్తోంది. ఇందులో అనసూయను వ్యక్తిగతంగా ఆది కించపరిచినట్టు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎడిటింగ్ లో సదురు చానెల్ చేసిన ఈ పనికి అనసూయ, హైపర్ ఆదిలు బ్లేమ్ అయ్యారు.

ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చిన అనసూయ చానెల్ వాళ్లు వీడియోను అడ్డదిడ్డంగా కట్ చేసి రేటింగ్ కోసం ఆది నన్ను తిట్టినట్టు బూతు మాటలు అన్నట్టు చూపించారని.. దీనివల్ల మా పరువు తీశారని.. ఆదివారం ప్రసారమయ్యే షో లో అలాంటిదేమీ లేదని బాధతో వివరణ ఇచ్చింది. వీడియోలు రిలీజ్ చేసేముందుకు యాంకర్ లు, నటుల మనోభావాలను గుర్తించి రిలీజ్ చేయాలని అనసూయ సదురు చానెల్ కు చీవాట్లు పెట్టింది. మొత్తంగా ఈ కాంట్రవర్సీ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

To Top

Send this to a friend