చంద్రబాబు మోసం చేశాడు..

దాదాపు 30 ఏళ్లు నెల్లూరు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ మంత్రులుగా ఉమ్మడి ఏపీలో సేవలందించిన ఆనం బ్రదర్స్ కు ఇప్పుడు ఆదరణ కరువైంది. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన ఆనం రామనారాయణ రెడ్డి, ఆయన అన్న వివేకానందరెడ్డిలు ఏపీ విడిపోయాక కాంగ్రెస్ లో భవిష్యత్ లేదని టీడీపీలో చేరారు. కానీ ఇక్కడ వారికి ఆదరణ కరువైంది..

పోయిన నెలలో నెల్లూరు వీఆర్సీ కళాశాల ప్రారంభోత్సవానికి స్థానిక నేతలైన ఆనం బ్రదర్స్ను పిలవకపోవడం దుమారం రేగింది. మున్సిపల్ మంత్రి నారాయణే దీన్ని ప్రారంభించేశారు. దీంతో కలత చెందిన ఆనం వివేకానందరెడ్డి హైదరాబాద్ లోనే ఉంటూ నెల్లూరు రావడం లేదు. టీడీపీ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం లేదు..

ఇక చంద్రబాబు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరినప్పుడు వివేకకు ఎమ్మెల్సీ పదవి, రాంనారాయణకు కార్పొరేషన్ పదవి ఇస్తానని హామీ ఇచ్చాడు. ఇటీవల గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కేటాయింపులో కూడా చంద్రబాబు ఆనం బ్రదర్స్ ను పరిగణలోకి తీసుకోకుండా పక్కన పెట్టేశాడు. దీంతో ఇక టీడీపీలో చేరి మోసపోయామని ఆనం వివేక స్థానిక నేతల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఎమ్మెల్సీ ఇవ్వక, అటు పార్టీలో పట్టించుకోకుండా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని.. తాము ఇక టీడీపీలో మోసపోయామని ఆనం వివేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.. త్వరలోనే పార్టీ మారేందుకు కూడా సిద్ధమైపోయినట్టు సమాచారం.

To Top

Send this to a friend