అంతులేని కథ.. ఈనాటి కల్చర్ వ్యథ..


ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైపోయాయి. పల్లెల నుంచి పట్నాలకు వలసలు మొదలయ్యాయి. అమ్మమ్మ, నానమ్మల పర్యవేక్షణ కొరవడింది. కట్టుకున్న మొగుడిని కూడా వాట్సాప్, ఫేస్ బుక్ లలో పలకరించే పరిస్థితులు దాపురించాయి. ఉద్యోగరీత్యా స్నేహాలు మొదలై.. మొగుడు/పెళ్లాలను గాలికొదిలేసి సహజీవనానికి మొగ్గు చూపుతున్న జంటలు మన సమాజంలో కోకోల్లలుగా ఉన్నాయి..

హైదరాబాద్ లో బ్యూటీషియన్ మరణం.. కుకునూర్ పల్లిలో ఎస్.ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య. మద్యలో బలైపోయింది ఎస్.ఐ భార్యపిల్లలు, శిరీష కూతరు, భర్త. విచ్చలవిడి వ్యవహారంతో అదుపుతప్పిన శిరీష వల్ల ఇప్పుడు రెండు కుటుంబాల్లో తీరని వ్యథ మిగిలింది. బ్యూటిషియన్ గా చేస్తూ  మొగుడికి దూరంగా ఉంటూ రాజీవ్ తో సహజీవనం చేస్తోంది శిరీష. రాజీవ్ యువకుడు.. ఇటీవలే ఫేస్ బుక్ లో పరిచయమైన మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దానికి శీరిష అడ్డు వచ్చింది. నా పరిస్థితి ఏంటనీ నిలదీసింది. పంచాయతీ మొదలైంది. కుకునూర్ పల్లి ఎస్.ఐ వద్ద పంచాయతీకి వచ్చారు.. ఆయన పెద్దరికంగా పరిష్కరించాల్సింది పోయి.. వారితో కలిసి ఫుల్లుగా మద్యం తాగి శిరీష పైనే అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో అవమానం భరించలేక శిరీష ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను కార్లో తీసుకొస్తూ చితకబాది రాజీవ్, శిరీష స్నేహితుడు శ్రవణ్ మానసికంగా హింసించడంతో ఆ బాధ తట్టుకోలేకే సూసైడ్ కు యత్నించింది.

ఇలా ఓ మహిళ గతి తప్పి.. మగాళ్లను ఆడుకుంది. వాళ్లు ఆమెను వాడుకున్నారు. ఈ సదావకాశాన్ని అనుకూలంగా మలుచుకున్న ఓ ఎస్సై సైతం లోబరుచుకోవాలని ప్రయత్నించాడు. వెరసి ఇద్దరి ప్రాణాలు పోయాయి. మరో ఇద్దరు జైలు పాలయ్యారు. రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇది శిరీష అంతులేని కథ.. గుణపాఠంగా మిగిలిన వ్యథ..

To Top

Send this to a friend