అమ్మో ఏపీనా.? భయపడిన జపాన్ సంస్థ


ఓ జపాన్ కాంట్రాక్ట్ సంస్థ ‘మాకీ’ ఓ ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ కు ‘ఆర్కిటెక్చురల్ డైజిస్ట్’ పేరిట రాసిన వ్యాసంలో ఏపీలో పాలన, అవినీతి గురించి సంచలన విషయాలు బయటపెట్టింది. భారత దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో తాము కాంట్రాక్టులు నిర్వహిస్తున్నామని.. కానీ ఇంత చెత్త పరిపాలన.. ప్రభుత్వ తీరు, అవినీతిని ఎక్కడా చూడలేదని జపాన్ సంస్థ ‘మాకీ’ ఎండగట్టింది. ఏపీలో పెట్టుబడుల స్వరూపం.. అవినీతి గురించి బట్టబయలు చేసింది.

సదురు జపాన్ సంస్థ మాకీ ప్రపంచవ్యాప్తంగా పలు నీటి పారుదల ప్రాజెక్టులు, ఎయిర్ పోర్టుల నిర్మాణాలు… కన్ స్ట్రక్షన్ నిర్మాణాలు చేపడుతోంది. సదురు సంస్థ ఏపీ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఊదరగొట్టిన ప్రచారానికి ఆకర్షితులై ఏపీలో వివిధ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు కాంట్రాక్టు పొందిందట.. కానీ తీరా ఇక్కడికొచ్చి పనులు చేపట్టాక తెలిసిందట.. ఈ ఏపీ రాష్ట్రంలో పరిస్థితులు ఆఫ్ఘనిస్తాన్ రాష్ట్రంలో కంటే అధ్వానంగా ఉన్నాయని ఆ వ్యాసంలో పేర్కొన్నారు. అంతా అయోమయం.. ఇంతటి అసమర్థ నాయకత్వాన్ని ప్రపంచంలోనే తాము ఇంతవరకు చూడలేదని అందులో పేర్కొన్నారట..

అంతేకాదు.. ఏపీ రాజధాని నిర్మాణం కాదుకదా.. అక్కడ పిల్ల కాలువ కూడా తవ్వడానికి పైరవీలు, మామూళ్లు ముట్టజెప్పాలని.. ముఖ్యమంత్రి ఎన్నిసార్లు తలుచుకున్నా పనులు కాకపోవడానికి అవినీతి పేరుకుపోవడమే కారణమని  జపాన్ సంస్థ వ్యాసంలో వివరించిందట..

అంతేకాదు ఈ వ్యాసంలో అందరూ అపార్థం చేసుకుంటున్న బీహార్ రాష్ట్రాన్ని సదురు సంస్థ కీర్తించడం ఏపీకి అవమానంగా మారింది.. ‘ఐదేళ్ల క్రితం భారత్ వచ్చినప్పుడు బీహార్ లో పెట్టుబడులు పెట్టవద్దని తమకు సూచించారు. అది అధ్వాన రాష్ట్రమని హెచ్చరించారు. కానీ అక్కడ ఎంతో నిబద్ధతతో వ్యవహరించే ముఖ్యమంత్రి నితిష్ సాయంతో ప్రాజెక్టులు విజయవంతం పూర్తి చేయగలిగాం. ఏపీ కంటే బీహార్ వంద రెట్లు మెరుగైన రాష్ట్రం’ అనడంలో సందేహం లేదని వ్యాసంలో వివరించారు.

అంతేకాదు ఓ సినిమా దర్శకుడితో కలిసి ముఖ్యమంత్రి వేడుకలు, పనులు డిజైన్ చేయించడం ప్రపంచంలో ఎక్కడా జరగలేదని సెటైర్లు కూడా వ్యాసంలో వేశారట.. ఇప్పుడు ఈ మాకీ సంస్థ బయటపెట్టిన సంచలన విషయాలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి.

To Top

Send this to a friend