అమెరికాకు అధ్యక్షుడైనా పెళ్లాం పోరు తప్పలేదు..

హతవిధీ ఏమిటీదీ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరువు గంగలో కలిసిపోయింది. తన తొలి విదేశీ పర్యటనలో ఘోర అవమానం జరిగింది. ఇప్పటికే ట్రంప్ తన న్యూయార్క్ లోని సొంత రాజప్రసాదం వదిలి అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కు మకాం మార్చాడు. అయినా ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ తో రాలేదు. మెలానియా ఇంకా న్యూయార్క్ లోనే విడిగా ఉంటోంది. ఇప్పుడు తొలి విదేశీ పర్యటనలోనే ట్రంప్ కు అదిరిపోయే రీతిలో షాక్ ఇచ్చింది అతడి భార్య..

బుధవారం తొలి విదేశీ పర్యటనలో భాగంగా రోమ్ లో అడుగుపెట్టిన ట్రంప్ విమానం దిగుతూ భార్య చేతి పట్టుకునే పని చేశాడు. ఆమె వెంటనే చేతిని విసిరికొట్టి దురుసుగా పక్కకు జరిగింది. దీంతో ట్రంప్ నవ్వుతూ ఆమెను సముదాయించాడు. కవర్ చేశాడు. ప్రపంచ మీడియా అంతా ఈ దృశ్యాన్ని కవర్ చేసింది.
దీంతో ఇది సోషల్ మీడియాలో, న్యూస్ చానల్స్ లో రచ్చరచ్చగా మారింది.

లేటెస్ట్ గా ఇటలీ నుంచి సౌదీ అరేబియా రియాద్ కు వచ్చిన ట్రంప్ కు మరోసారి అదే చేదు అనుభవం ఎదురైంది. ట్రంప్ విమానం దిగుతూ మెలానియా చేతిని అందుకోగా ఆమె విసిరికొట్టింది. అంతేకాదు.. రియాద్ లో రెడ్ కార్పెట్ లో ట్రంప్ పక్కన కాకుండా మెలానియా వెనుకాల నడిచారు. ట్రంప్ తో విబేధాల కారణంగానే మెలానియా ఇలా చేశారని ఆమె చేష్టలు స్పష్టం చేస్తున్నాయి. ఈ దంపతుల మధ్య గొడవల కారణంగా వీరి పరువు గంగలో కలిసింది. అమెరికా కు అధ్యక్షుడుకైనా ఇంటిపోరు ఉంటే ఎంతో ఇబ్బందో ఈ పరిణామాలు రుజువుచేశాయి.

To Top

Send this to a friend