బాహుబలిపై అమీర్ ఖాన్ కామెంట్

సచిన్ టెండూల్కర్ బయోపిక్ సినిమా ‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’ ప్రీమియర్ షో ముంబైలో జరిగింది. బుధవారం భారత క్రికెటర్లందరికీ చూపించిన సచిన్.. ఈరోజు ప్రత్యేక షో వేసి బాలీవుడ్ అగ్రహీరోలకు చూపించారు. ఈ సినిమాను బాలీవుడ్ టాప్ హీరో అమీర్ ఖాన్ కూడా చూశాడు. ఈ సందర్భంగా బయటకు వచ్చిన అమీర్ ఖాన్ ను సినిమా గురించి అడగ్గా సచిన్ బయో గ్రఫీ సినిమా అద్భుతమని ప్రశంసించాడు.

పనిలోపనిగా దేశ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు 1500 కోట్లు సాధించిన బాహుబలి2 సినిమాపై మీ కామెంట్ ఏంటీ అని విలేకరులు ప్రశ్నించగా.. ‘తాను ఇంకా ఆ సినిమాను చూడలేదని’ అమీర్ వ్యాఖ్యానించడం గమనార్హం. బాహుబలి2 సినిమా రిపోర్ట్స్ వింటున్నానని.. ఇంతటి ఘనవిజయం సాధించిన సినిమాకు దర్శకుడు రాజమౌళికి, అతని టీమ్ కు నా అభినందనలు అంటూ అమీర్ ఖాన్ చెప్పాడు.

అలాగే తన దంగల్ సినిమా చైనాలో వస్తున్న ఆదరణపై కూడా స్పందించాడు. చైనాలో కలెక్షన్లతో 1000 కోట్లు దాటిన దంగల్ ను, బాహుబలిని పోల్చవద్దని రెండు వేరు వేరు సబ్జెక్టులు అని అమీర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రెండు భారత సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఈ స్థాయి వసూళ్లు సాధించడం గర్వకారణమని అమీర్ పేర్కొన్నారు.

కాగా బాహుబలి2 1500 కలెక్షన్లు దాటి రికార్డు దిశగా సాగిపోతోంది. అయినా కూడా దీనిపై బాలీవుడ్ అగ్ర హీరోలు, దర్శకులు కామెంట్లు చేయకపోవడంపై గమనార్హం. ప్రాంతీయ తెలుగు సినిమా సాధించిన ఈ విజయాన్ని జీర్ణించుకోలేక అమీర్ సహా పెద్ద హీరోలు ఈ సినిమా చూడలేదని చెబుతున్నారని.. బాహుబలి2 ను చూసి వీరంతా అలాంటి సినిమాలు తీసేలా అప్ గ్రేడ్ కావాలని సినీ విమర్శకులు పేర్కొంటున్నారు.

To Top

Send this to a friend