రాజకీయాలను టార్గెట్ చేసిన అల్లు అర్జున్..

కొత్త దర్శకుడు వక్కంతం వంశీ రచయిత నుంచి దర్శకుడిగా మారి తీస్తున్న తొలిచిత్రంలో స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా నటించేందుకు సిద్ధమయ్యారు. ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ అనే టైటిల్ తో సినిమాను మొదలు పెట్టాడు. వచ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. రేసుగుర్రం, టెంపర్, కిక్, ఊసరవెళ్లి, అతిథి లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథను అందించిన వక్కతం వంశీ ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా తొలిసారి మెగా ఫోన్ పట్టబోతున్నాడు.

ఇప్పటికే రచయితలుగా జీవితం ప్రారంభించి దర్శకులుగా ఎదిగిన త్రివిక్రమ్, కొరటాల శివలు ఇప్పుడు తెలుగులో టాప్ దర్శకులుగా మారిపోయారు. వారిని ఆదర్శంగా తీసుకొని వక్కంతం వంశీ కూడా ఇప్పుడు దర్శకుడిగా అవతారమెత్తాడు. విలక్షణ కథలతో తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ రచయితగా ఎదిగిన వక్కంతం వంశీ డైరెక్టర్ గా మారి తీస్తున్న తొలి చిత్రమే రాజకీయాలను కుదిపేసే కథ అని తేలడంతో ఇండస్ట్రీలో, తెలుగు నాట ఆసక్తి రేపుతోంది.

వంశీ బన్నీ హీరోగా సిద్ధం చేసిన కథలో తెలుగు, దేశ రాజకీయాలను టచ్ చేసినట్టు తెలుస్తోంది. దర్శకుడిగా తన తొలిచిత్రం కావడం.. అందునా ప్లాపులు ఎరుగని బన్నీ హీరో కావడంతో సోషల్ మెసేజ్ తో పాటు కమర్సియల్ హంగులు కలిసిన కథను సిద్ధం చేసి వినిపించగా బన్నీ వెంటనే ఒప్పుకొని సినిమా చేయడానికి రెడీ అయిపోయాడట..

బన్నీతో కలిసి నటించే హీరోయిన్ కోసం చాలా మంది పేర్లను పరిశీలించిన చిత్రం యూనిట్ హీరోయిన్ గా చివరకు మజ్నూ , కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ప్రస్తుత పవన్ సినిమాలో హీరోయిన్ చేస్తున్న అనూ ఇమ్మాన్యూయల్ ను ఎంచుకున్నారు. బన్నీతో జోడీగా ఆమె నటించనుందని యూనిట్ కన్ఫమ్ చేసింది.

To Top

Send this to a friend