అల్లు అర్జున్‌ గత జన్మలో…!

మెగా స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ సినిమా సినిమాకు అభిమానులను పెంచుకుంటూ వెళ్తున్నాడు. తెలుగు స్టార్‌ హీరోల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానంను దక్కించుకున్న అల్లు అర్జున్‌ గత జన్మ రహస్యంను ప్రముఖ జ్యోతిష్యుడు ఎస్వీ నాగనాథ్‌ చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్‌ గత జన్మలో ఏంటి, ఎందుకు ఈ జన్మలో ఇంత స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు అనే విషయాన్ని క్లీయర్‌గా చెప్పుకొస్తున్నాడు.

అల్లు అర్జున్‌ గత జన్మలో ఏంటో తెలిస్తే షాక్‌ అవుతారు. గత జన్మలో ఉత్తర భారతదేశంలో అల్లు అర్జున్‌ ఒక రైతు. ఆ జన్మలో ఒక సాదారణ రైతుగా జీవించిన అల్లు అర్జున్‌ ఒకానొక సమయంలో తన పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలో బంగారు నాణేలు లభించడంతో వాటిని పేదలకు పంపిపెట్టాడు. ఆ పుణ్యం కారణంగానే అల్లు అర్జున్‌ ఈ జన్మలో అంత రాజభోగం అనుభవిస్తున్నాడని, ఈ స్థాయికి ఆ పుణ్యం కారణంగా ఎస్వీ నాగనాథ్‌ చెబుతున్నారు.

పూర్వ జన్మ, పునర్జన్మల గురించి పెద్దగా పట్టించుకోని వారు వీటిని కొట్టి పారేస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఇది ఎలా సాధ్యం, ఎలా బన్నీ పూర్వ జన్మ గురించి చెబుతున్నారు, ఆయన జాతకం ఏమైనా చూసి చెబుతున్నారా లేక ఆయన మొహంలోనే ఆ విషయాలు తెలుస్తాయ అంటూ ప్రశ్నిస్తున్నారు. అల్లు అర్జున్‌ ఈ విషయమై ఎలా స్పందిస్తాడో చూడాలి.

To Top

Send this to a friend