బన్నీ పారితోషికం భారీగా పెంచేశాడు!

 

అల్లు అర్జున్‌ వరుస విజయాలతో దూసుకు వెళ్తున్నాడు. కెరీర్‌లోనే ‘సరైనోడు’ చిత్రంతో బిగ్గెస్ట్‌ సక్సెస్‌ను దక్కించుకుని టాలీవుడ్‌ టాప్‌ 10 చిత్రాల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. బన్నీ వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న నేపథ్యంలో ఆయన పారితోషికం కూడా భారీగా పెంచేశాడు. ‘సరైనోడు’ సినిమా 50 కోట్ల మార్క్‌ దాటిన నేపథ్యంలో బన్నీ తన పారితోషికాన్ని ఏకంగా అయిదు కోట్లు పెంచినట్లుగా తెలుస్తోంది.

‘సరైనోడు’ ముందు వరకు బన్నీ పారితోషికం 10 కోట్ల లోపులోనే ఉండేది. కాని ‘డీజే’ సినిమా కోసం బన్నీ ఏకంగా 15 కోట్ల పారితోషికాన్ని అందుకున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు రామ్‌ చరణ్‌ స్థాయిలో బన్నీ పారితోషికాన్ని పుచ్చుకుంటున్నాడు. ఈ సినిమా సక్సెస్‌ అయితే చరణ్‌ను క్రాస్‌ చేసినా ఆశ్చర్యం లేదు. దిల్‌రాజు ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్నాడు. తన బ్యానర్‌లో 25వ సినిమా అవ్వడం వల్ల దిల్‌రాజు డబ్బును లెక్క చేయకుండా ముందుకు సాగుతున్నాడు.

ఇప్పటి వరకు బన్నీ నటించిన ‘బద్రినాథ్‌’ తప్ప ఏ సినిమా అయినా 30 కోట్ల బడ్జెట్‌ను దాటింది లేదు. ‘డీజే’ సినిమా మాత్రం ‘బద్రినాథ్‌’ను కూడా క్రాస్‌ చేసింది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ‘డీజే’ సినిమాకు దాదాపుగా 60 కోట్ల బడ్జెట్‌ అయినట్లుగా తెలుస్తోంది. 25వ సినిమా అవ్వడంతో పాటు, బన్నీ కెరీర్‌లో వరుస సక్సెస్‌లు వచ్చిన నేపథ్యంలో ఇంత భారీ బడ్జెట్‌తో దిల్‌రాజు సాహసంను చేసినట్లుగా తెలుస్తోంది. ఈనెల 23న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

To Top

Send this to a friend