500 కోట్లతో అల్లు అరవింద్

రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో బడా నిర్మాత అల్లు అరవింద్ సినిమా చేస్తానని ప్రకటించాడు. ఇందులో హీరో, హీరోయిన్లు ఎవరనే విషయాలను మాత్రం ఇంకా ఖరారు చేయలేదని తెలిపాడు. ఈ సినిమా పట్టాలెక్కితే దేశంలోనే అతి ఎక్కవ బడ్జెట్ తో తీసే సినిమా ఇదే అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే బాహుబలి 2 పార్టులకు కలిపి 400 కోట్ల బడ్జెట్ అయ్యిందని రాజమౌళి చెప్పాడు. ఇప్పుడు దానికంటే ఎక్కువగా.. 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది..

కాగా ఈ సినిమా ప్రకటించగానే హీరో రానా స్పందించాడు. రామాయణం లాంటి గొప్ప కథలో రావణాసురుడి పాత్ర చేసే అవకాశం వస్తే వదులుకోనని.. అలాంటి పాత్రలు ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ చేయలేమని’ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

రానా ఇప్పటికే బాహుబలిలో భళ్లాలదేవుడిగా విలనిజంను బాగా పండించాడు. విలన్ పాత్రలకు ఇప్పుడు అందరూ రానానే ఎంచుకుంటున్నారు. దీంతో అల్లు అరవింద్ తీసే రామాయణంలో కూడా రానాకు విలన్ పాత్ర ఖాయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమాకు దర్శకుడు, హీరో, హీరోయిన్లు ఎవరనే విషయాన్ని అల్లు అరవింద్ ప్రకటించకపోవడం ఉత్కంఠ రేపుతోంది.

To Top

Send this to a friend