క్యాన్సర్‌తో చనిపోబోతున్న నటి

తెలుగులో పలు చిత్రాల్లో నటించి తన కామెడీతో అలరించిన అల్లరి సుభాషిణి ప్రస్తుతం చావుబతుకుల్లో ఉన్నారు. తెలుగులో దాదాపు 250 చిత్రాల్లో నటించిన ఆమె ప్రస్తుతం ప్రాణాంతక క్యాన్సర్‌ వ్యాదితో బాధపడుతున్నట్లుగా ఆమె సన్నిహితులు చెప్పుకొచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆమె క్యాన్సర్‌ కారణంగా ఇంటికే పరిమితం అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మరీ దిగజారి పోయిందని, ఆమె చికిత్స కోసం ఆర్థిక సాయం కావాలంటూ ఆమె కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఇటీవల ఒక ఆపరేషన్‌ కోసం స్నేహితులు 5 లక్షల వరకు సాయం చేశారు. ఇప్పుడు సుభాషిణికి మరో ఆపరేషన్‌ చేయాల్సి ఉందట. ఆమె ఆరోగ్యం కోసం కుటుంబ సభ్యులు ఇప్పుడు ఖర్చు పెట్టే పరిస్థితుల్లో లేరు. ఆమెపై అభిమానంతో ఇప్పటికే సన్నిహితులు, స్నేహితులు సాయం చేశారు. అయినా కూడా ఆమె జీవితం అంధకారంలోనే ఉన్నట్లుగా చెబుతున్నారు. సినిమా పరిశ్రమలో ఎన్నో చిత్రాలు చేసిన సుభాషిణికి ఇలాంటి పరిస్థితి రావడం పట్ల సినీ వర్గాల వారు కూడా తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఎంఎంజే హాస్పిటల్‌ వారు సుభాషిణికి చికిత్స అందిస్తున్నారు. వీరు తక్కువ ఖర్చుకే ఆమెకు వైధ్యం అందిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నా కూడా ఆమె సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమెను సినిమాల్లో ఎంపిక చేయాలంటూ కొందరు కోరుతున్నారు. అయితే సుభాషిణికి ఆర్థిక సాయం అయితే చేస్తామంటున్నారు, కాని ఆమెకు మాత్రం సినిమాల్లో ఛాన్స్‌ ఇచ్చేందుకు ఏ ఒక్కరు ఆసక్తి చూపడం లేదు.

To Top

Send this to a friend