వంట నూనెలన్నీ విషమే.. ఇవి వాడండి..

జీవితాంతం వాతాన్ని క్రమంలో ఉంచాలంటే మీరు శుద్ధమైన వంట నూనెలను వాడవలెను. శుద్ధమైన నూనె అంటే నాన్ రిఫైండ్ నూనే ( Non Refined Oil ) . నూనెలో ఏమీ కలపకుండా గానుగ నుండి సరాసరి తెచ్చుకున్న నూనె వాడాలి. ఈ శుద్ధమైన నూనెకు వాసన ఎక్కువగా ఉంటుంది , బాగా జిగురు , జిగురుగా ఉంటుంది. చిక్కగా మంచి వాసన వస్తూ ఉంటుంది . నూనెలో ఉండ వలసిన ముఖ్య అంశం జిగురు పదార్ధము , ప్రోటీన్స్ . ఆ జిగురును వేరు చేస్తే నూనె మిగలదు . నూనెలో వాసన రూపంలో ఉండే ఆర్గానిక్ కంటేంటే ప్రోటీన్స్ , ఫ్యాటీ యాసిడ్స్. నూనెని రిఫైండ్ ( Refined ) చేసినపుడు జిగురు , వాసన పోతాయి . ఇక అందులో ఉండేది నూనె కాదు నీళ్ళే .ఏ నూనెలో కూడా మంచి కొలెస్ట్రాల్ , చెడ్డ కోలెస్ట్రాల్ వుండదు . మనము తీసుకొనే ఆహారము మరియు నూనెల నుండి మన శరీరంలో ఈ కొలెస్ట్రాల్ తయారవుతుంది . మనము శుద్ధమైన నూనె ( Non Refined Oil ) తీసుకున్నప్పుడు మన శరీరంలో *లివర్* సహాయంతో మంచి కొలెస్ట్రాల్ ( H.D.L.) ఎక్కవ మోతాదులో తయారవుతుంది. శుద్ధమైన నూనె వాడి జీవితాంతం ఆరోగ్యంగా ఉండండి .

 

 

భారత దేశంలో 50 సంవత్సరాల పూర్వం వరకు ఈ రిఫైండ్ ఆయిల్ లేదు . రిఫైండ్ నూనె చేసేటప్పుడు 6 రకాల హానికరమైన కెమికల్స్ , డబుల్ రిఫైండ్ చేసేటప్పుడు 13 రకాల హానికరమైన కెమికల్స్ వాడుతారు . ఈ కెమికల్స్ ముందు ముందు మన శరీరంలో వాటంతట అవే విషాన్ని పుట్టిస్తాయి . ఈ రిఫైండ్ అయిలో మన శరీరానికి కావలసిన జిగురు , వాసన , ప్రోటీన్స్ , ఫ్యాటీ యాసిడ్స్ ఏవీ వుండవు. చాలా హానికరమైన ఎటువంటి రిఫైండ్ ఆయిల్స్ వాడకూడదు .వాతాన్ని నివారించటానికి శుద్ధమైన నూనె , పిత్తాన్ని నివారించటానికి దేశవాళి ఆవు నెయ్యి , కఫంను సక్రమంగా ఉంచాలంటే అన్నింటికన్నా ఉత్తమమైనది బెల్లం , తేనె. కుస్తీపట్లు , దండీలు , బస్కీలు తీసేవారికి మాత్రమే గేదె నెయ్యి మంచిది .

 

 

రోగాలకు రాజు వాతరోగాలు.
మోకాళ్ళ నొప్పులు , నడుం నొప్పి , మెడనొప్పులు , హార్ట్ ఎటాక్ , పక్షవాతము , బ్రైన్ ట్యూమర్ వంటివి వాతము పూర్తిగా తగ్గిపోవటం వల్ల కానీ లేదా చెడిపోవటం వల్ల కానీ కలుగుతాయి .

జీవితాంతం వాతాన్ని క్రమంలో ఉంచాలంటే మీరు శుద్దమైన నునెలు ( Non -Refined ) వేరు శెనగ నూనె , కొబ్బెర నూనె , కుసుమల నూనె , నువ్వుల నూనె మరియు ఆవాల నూనెలు మాత్రమే వాడవలెను .

ప్రొద్దుతిరుగుడు పూల విత్తనాలను ( Sun flower seeds ) గేదలకు మరియు పశువులకు మాత్రమే పెట్టదగినవి . మనకు ఏ మాత్రము ఈ Sun flower oil వాడదగినది కాదు , ఆరోగ్యకరము కాదు .

ఈ రిఫైండ్ ఆయిల్స్ ( Refined oils) ఎంత మాత్రమూ వాడతగినవి కాదు .

సోయాబీన్స్ , సోయాబీన్స్ ఆయిల్ మరియు సోయాబీన్ పాలు ఏ మాత్రము వాడరాదు . పందులు తినతగినవి ఈ సోయాబీన్స్ , ఎందుకనగా పందులు మాత్రమే వీటిని తిని అరగించు కోగలవు . మనుష్యులలో ఈ సోయాబీన్స్ ని అరిగించే ఎంజైమ్స్ లేనే లేవు . కావున వీటిని వాడరాదు . వీటిని వాడిన యెడల మందులు లేని భయంకరమైన రోగాలు ఖచ్చితంగా వస్తాయి .

పామోలిన్ అయిల్ కూడా చాలా హానికరమైన అయిల్ . వీటిని వాడుతున్నవారికి మొదట మలబద్దకుము వస్తుంది. ఈ మలబద్దకమే అన్ని రోగాలకు మూలము. ప్రస్తుతము చాలా రోగాలకు మూలము ఈ పామోలిన్ అయిల్. ఈ పామోలిన్ పంట పండించే దేశాలలో ఈ నూనెను నిషేదించినారు . వారు ఏ విధముగా కూడా ఈ పామోలిన్ వాడటం లేదు . ప్రపంచములో ఒక్క భారత దేశములో మాత్రమే ఉపయోగిస్తున్నారు .

To Top

Send this to a friend