ఎవరీ అకున్ సబర్వాల్…

తెలంగాణలో ప్రస్తుతం ఆ ఐపిఎస్ ఆఫీసర్ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. మోసగాళ్లకు సింహాస్వప్నంగా మారారు. మత్తుగాళ్లను చిత్తు చేస్తున్నారు.నకిలీలపైన ఉక్కుపాదం మోపుతున్నారు.ఆయననే ఐపిఎస్ అధికారి అకున్ సబర్వాల్. సినిమా పరిశ్రమను గజగజలాడిస్తున్న మొనగాడు.ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తట్టుకొని నిలబడి మత్తుగాళ్ల మొఖాలను జనానికి చెపుతున్నాడు. డ్రగ్స్ దందా గుట్టురట్టు చేసి హైదరాబాద్ కు పట్టిన పీడను వదిలించేందుకు అకున్ కంకణం కట్టుకున్నాడు. సమాజంలో హీరోలా చలామణి అవుతు రాత్రి వేళలో వారు చేస్తున్న పనులను ఆయన ధైర్యంగా వెలికి తీశారు.గతంలో చాలా మంది ఆఫీసర్లు తీగ లాగి ఆ తర్వాత పక్కన పడేస్తే అకున్ మాత్రం మొత్తం డొంక కదిలించారు.ఆయన దెబ్బకు మత్తుగాళ్ల మత్తు వదిలింది.

నిజానికి అకున్ సబర్వాల్ కు ఏ పని అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తారనే పేరుంది.2001లో సివిల్స్ కు సెలెక్ట్ అయిన అకున్ నిజానికి డెంటిస్టు. మొదట అస్పాం కేడర్ కు ఎంపికైన ఆయన అక్కడ కూడా తీవ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడారు.తన బ్యాచ్ మెట్ అయిన స్మిత్ సబర్వాల్ ను పెళ్లి చేసుకున్న అకున్ ఆంధ్రప్రదేశ్ కేడర్ కు మారారు.అనంతపురంలో మొదట బాధ్యతలు తీసుకున్న ఆయన ఫ్యాక్షనిస్టుల పనిపట్టారు. అక్కడి నుంచి వరంగల్ ఓఎస్డిగా పనిచేసిన ఆయన నక్సల్స్ నిర్మూలనకు క్రుషి చేశారు. ఆ తర్వాత విశాఖ జిల్లా ఎస్పీగా పనిచేసిన అకుల్ అక్కడ మావోయిస్టుల నుంచి గట్టి సవాల్ ను ఎదుర్కొన్నారు.ఆయన హయాంలో జిల్లాలో ఏకంగా 28 సార్లు పోలీసులు,మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరగడం విశేషం.అక్కడి నుంచి హైదరాబాద్ కు వచ్చిన డీసీపీగా పనిచేశారు. సౌత్‌ జోన్ డీసీపీగా పనిచేసిన సమయంలో కర్ఫ్యూ కారణంగా ఆయన నెలల తరబడి రోడ్లపైనే పనిచేశారు.

తెలంగాణ లో గుడుంబాను నిర్మూలించాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సబర్వాల్ కు ఎక్సైజ్ శాఖ అప్పగించారు.సి.ఎం నమ్మకాన్ని వమ్ము చేయని అకున్ స్వల్పకాలంలో తెలంగాణను గుడుంబా రహితంగా మార్చగల్గారు.తాజాగా డ్రగ్స్ పైన కన్నెసిన ఆయన మొత్తం గుట్టును రట్టు చేశారు.ఆయన పట్టుదలతో మొత్తం డ్రగ్స్ గ్యాంగ్‌ లు పోలీసుల చేతికి చిక్కాయి.డ్రగ్స్ వినియోగిస్తున్న సినిమా ప్రముఖులను కూడా అకున్ సబర్వాల్ రోడ్డుపైకి లాగారు. దీంతో ఎప్పుడు లేనంతగా తెలుగు సినిమా పరిశ్రమ షేక్ అయింది. డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్ గా బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ఆయన నకిలీ మందుల ముఠాలను అరికట్టారు.
1976 లో పాటియాలాలో జన్మించిన అకున్ సబర్వాల్ దేశంలోని పలు ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేశారు. ఆయన తండ్రి ఆర్మీలో పనిచేయడం వల్ల అనేక చోట్ల చదవాల్సి వచ్చింది.

అకున్ సబర్వాల్ భార్య స్మితా సబర్వాల్ కూడా డైనమిక్ ఆఫీసర్ గా పేరుతెచ్చుకున్నారు. కలెక్టర్ గా ఆమె పనితీరును గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తన కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా నియమించారు. అకున్, స్మితా దంపతులకు ఇద్దరు పిల్లలు. అకున్ తల్లి ఇటీవలె మరణించారు. మొత్తానికి అకున్ సబర్వాల్ తన పనితీరుతో అనేక మంది మార్గదర్శకంగా నిలుస్తున్నారు.

To Top

Send this to a friend