టాలీవుడ్ హీరోలకు మూడినట్టే..

డ్రగ్స్ తీసుకుంటున్న తెలుగు సినిమా పరిశ్రమ పెద్దల బాగోతాన్ని బయటపెట్టిన ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ ఈరోజు నుంచి 27వరకు సెలవుపై వెళ్లాల్సి ఉంది. ఆయన వ్యక్తి కారణాలతో సెలవు కోరితే ప్రభుత్వం ఇచ్చింది. కానీ టాలీవుడ్ పరిశ్రమ పెద్దల డ్రగ్స్ బాగోతాల్ని బయటపెట్టి.. ఇప్పుడు వాళ్ల అమ్మ కర్మ క్రియలు నిర్వర్తించడం కోసం ఆయన సొంతూరు యూపీ వెళుతున్నాడని చెప్పినా మీడియాలో ఎవ్వరూ వినలేదు. కేసును నీరుగార్చడానికే తెలంగాణ ప్రభుత్వం అకున్ ను సెలవుపై పంపుతోందని విమర్శలు వచ్చాయి. దీంతో అకున్ వెనక్కి తగ్గాడు. తన సెలవును రద్దు చేసుకున్నాడు.

తెలంగాణ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ హైదరాబాద్ లో డ్రగ్స్ కేసును చేధించారు.  తెలుగు సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడే ప్రముఖుల జాబితాను విడుదల చేసింది. వారందరికీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19 నుంచి 27 వరకు  వారందరినీ పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే వీరందరినీ గుర్తించి నోటీసులు పంపించారు. వారం పాటు వీరందరినీ పోలీసులు ప్రశ్నించి ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు..? డ్రగ్స్ ముఠాలతో సంబంధాలపై ఆరాతీయనున్నారు. అయితే టాలీవుడ్ ప్రముఖులను విచారించకుండా అకున్ సెలవుపై వెళుతున్నాడని ప్రకటించడంతో దుమారం రేగింది. కేసు నీరుగార్చేందుకు ఇలా చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి.

సోషల్ మీడియా, మీడియాలో దీనిపై విమర్శలు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం సమర్థ అధికారిని సెలవుపై పంపుతోందని వార్తలు వెలువడ్డాయి. దీంతో టీ ప్రభుత్వం అలెర్ట్ అయ్యి అకున్ సభర్వాల్ సెలవును రద్దు చేసింది.  నోటీసులు పంపిన తెలుగు సినీ ప్రముఖులను అకున్ ప్రశ్నిస్తారని స్పష్టం చేసింది. అకున్ కూడా తన సెలవును రద్దు చేసుకుంటున్నట్టు మీడియాకు తెలిపారు. దీంతో ఈ కేసులో పురోగతి కనిపించే అవకాశాలున్నాయి.

To Top

Send this to a friend