ఎక్కువ తినకుండా చట్టం తెస్తున్న మోడీ..


దేశంలో ఓ సర్వే ప్రకారం ప్రతి ఏటా రూ.92 651కోట్ల విలువైన ఆహారం వృథా అవుతోంది. అంతేకాకుండా 6.7 కోట్ల ఆహార పదార్థాలు చెత్త పాలవుతున్నాయట.. వీటన్నింటిని గనుక బీహార్ రాష్ట్ర ప్రజలకు పంచితే వారు ఏడాది పాటు తినవచ్చట.. ఆహార వృథా పై సర్వే చేసిన జాతీయ ఆహార సంస్థ ఈ మేరకు నివేదిక రూపొందించింది. దీనిపై కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ఇటీవల ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ఆహార వృథాపై త్వరలోనే చట్టం తీసుకురాబోతున్నామని తెలిపారు..

ఇన్నాళ్లు బిర్యానీ ఆర్టర్ ఇస్తే.. పెద్ద ప్లేట్ నిండా బిర్యానీ.. ఓ నాలుగు చికెన్ ముక్కలు అందులో ఇస్తారు. ఓ రూ.150 తీసుకుంటారు. కానీ ఓ వ్యక్తి అదంతా తినడు.. మిగతాదంతా వృథాగా చెత్తపాలే.. అలా కోట్ల విలువైన ఆహారం అటు పేదలకు దక్కకుండా ఇటు సంపన్నులు తినకుండా వృథాగా వదిలేస్తున్నారు. దీనిపై తీవ్రంగా ఆలోచిస్తున్న కేంద్రం ఆహార వృథాను అరికట్టేందుకు చట్టం తీసుకురాబోతున్నట్టు తెలిసింది. మొన్నీ మధ్య ప్రధాని మోడీ మన్ కీ బాత్ లో కూడా ఆహారవృథా ఎక్కువైందని ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసింది.

ఈ చట్టంలో భాగంగా ఓ వ్యక్తి తినగలిగే ఆహారం మాత్రమే పెట్టాలని.. ప్లేటులో ఇన్ని ఉంటాయని ముందుగానే చెప్పేలా మెనూ తయారు చేయాలని చట్టంలో పేర్కొంటారట.. అంటే ఓ మనిషి రెండు చికెన్ పీసులు తింటాడని భావిస్తే ఆమేరకు రేట్ కట్టి దానికే డబ్బులు తీసుకోవాలి. ఆ తర్వాత కావాలనుకునే వారికి విడతల వారీగా భోజనం పెట్టాలి. అంతే.. బిర్యానీ ఆర్టర్ ఇవ్వగానే వాళ్లు తిన్నా తినకున్నా పెద్దమొత్తంలో ఇక నుంచి తేవడానికి వీల్లేదు. మనిషి తినే అంతే పెట్టాలని రెస్టారెంట్లకు ఆదేశాలు జారీ చేస్తారట.. సో.. ఇక నుంచి టిఫిన్ లో ఇడ్లీలు నాలుగు వచ్చినట్టు, రైస్, బిర్యానీలో కూడా అంతే మొత్తంలో ఆహారం అందుతున్నమాట.. మోడీ ప్రభుత్వం తీసుకోబోతున్న ఈనిర్ణయం త్వరలోనే అమల్లోకి రాబోతోంది.

To Top

Send this to a friend