అమ్మ, నాన్నను ఇలా వాడుతున్న అఖిల్‌


నాగార్జున, అమల జంటగా నటించిన ‘నిర్ణయం’ చిత్రంలోని హలో గురు ప్రేమకోసమేరో జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం.. అంటూ సాగే పాట ఎంతటి సూపర్‌ హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ ఆ పాట ప్రతి రోజు ఏదో ఒక ఛానెల్‌లో వినిపిస్తూనే ఉంది. అంతట భారీ విజయం సాధించింది కనుక ఆ పాట పల్లవిలోని మొదట పదాలను టైటిల్‌గా పెడితే క్యాచీగా బాగుంటుందనే అభిప్రాయంతో అఖిల్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది.

అఖిల్‌ రెండవ సినిమా ప్రస్తుతం విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాకు మొదట ‘జున్ను’ అనే విభిన్న టైటిల్‌ను నిర్ణయించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే తెలుగు ప్రేక్షకులు ఆ టైటిల్‌ను తిరస్కరిస్తారని నిర్మాత నాగార్జున భావిస్తున్నాడు. అందుకే చాలా ఆలోచించి కథకు తగ్గట్లుగా, సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయ్యేలా, ప్రేక్షకులకు క్యాచీగా ఉండేలా, కొత్తదనం కలిగి ఉండేలా ‘హలో గురు ప్రేమకోసమే..’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.

అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని నాగార్జున నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ టైటిల్‌ను నాగార్జున రిజిస్ట్రర్‌ చేయించినట్లుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం రెండవ షెడ్యూల్‌లో ఉన్న ఈ చిత్రానికి ఇంకా హీరోయిన్‌ ఎంపిక జరగలేదు. త్వరలోనే హీరోయిన్‌ను ఎంపిక చేసే అవకాశాలున్నాయి. మొదటి సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో అఖిల్‌ రెండవ సినిమా కోసం చాలా జాగ్రత్త పడుతున్నాడు. అన్ని విషయాల్లో కూడా ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. మరి ఈ సినిమా అయినా అఖిల్‌కు సక్సెస్‌ను తెచ్చి పెడుతుందా అనేది చూడాలి.

To Top

Send this to a friend