అక్కినేని ప్రిన్స్ అఖిల్ వివాహం శ్రియ భూపాల్‌తో ఇప్పటికి జరిగి పోవాల్సింది. ఇద్దరికి వివాహ నిశ్చితార్థం అయ్యింది కాని వివాహం మాత్రం జరగలేదు. పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టిన తర్వాత క్యాన్సిల్ అయ్యింది. దాంతో అఖిల్ పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టాడు. నాగార్జున మాత్రం అఖిల్ కొడుకు పెళ్లి విషయమై ఇంకా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అఖిల్ సినిమాల్లో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేయాలని భావిస్తున్న నాగార్జున తన కొడుకుకు వెంకటేష్ కూతురుతో వివాహం చేయాలనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
వెంకటేష్, నాగార్జునలు బావ బామర్ది అనే విషయం తెల్సిందే. వెంకటేష్ చెల్లిని నాగార్జున మొదటి పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరికి చైతూ కూడా పెట్టాడు. చైతూ పుట్టిన తర్వాత ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత అమలను వివాహం చేసుకున్నాడు. అమలను వివాహం చేసుకున్న తర్వాత కూడా నాగార్జున, వెంకీలు స్నేహంగానే ఉన్నారు. ఆ స్నేహంను మళ్లీ బందుత్వంగా మల్చుకునేందుకు నాగార్జున ఇలా కొత్త ఎత్తుగడ వేసినట్లుగా తెలుస్తోంది.
వెంకటేష్ కూతురుకు మరో రెండు మూడు సంవత్సరాల్లో పెళ్లి చేసే అవకాశం ఉంది. అప్పటి వరకు అఖిల్‌ను స్టార్ హీరోగా నిలబెట్టి వెంకటేష్‌ను కూతురును ఇవ్వమని అడగాలనేది నాగార్జున అభిప్రాయంగా తెలుస్తోంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం కుప్పలు తెప్పలుగా జరుగుతుంది. అయితే ఈ ప్రచారం ఎంత వరకు నిజం అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఈ వార్త కనుక నిజం అయితే తెలుగు ప్రేక్షకులు అంతా కూడా సంతోషిస్తారు.
