అఖిల్ .. జోష్ ఎందుకంటే..

చిన్నవయసులోనే ప్రేమ .. నిశ్చితార్థం వరకు వెళ్లిన అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్ ఇప్పుడు ట్రాక్ లోకి వచ్చేశాడు. హైదరాబాద్ కు చెందిన బడా పారిశ్రామికవేత్త మనవరాలు శ్రియా భూపాల్ తో పెళ్లి క్యాన్సల్ అయ్యి డిసప్పాయింట్ లో ఉన్న అఖిల్ ను సినిమాల్లోకి దించి నాగార్జున మళ్లీ బిజీగా చేశాడు.

మనం సినిమాతో అక్కినేని నాగార్జున ఫ్యామిలీకీ భారీ హిట్ ఇచ్చిన దర్శకుడు విక్రమ్ కుమార్.. తరువాత సూర్యతో కలిసి తీసిన 24 సినిమా కూడా భారీ హిట్ అయ్యింది. ఇప్పుడు నాగార్జున విన్నపం మేరకు అఖిల్ హీరోగా ఓ సినిమా తీస్తున్నాడు. ఎలాగైనా అఖిల్ ను హీరోగా నిలబెట్టాలని నాగార్జున -విక్రమ్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు.

చానాళ్లుగా సైలెంట్ గా ఉన్న అఖిల్ ఈ మధ్య ట్విట్టర్ లో మళ్లీ యాక్టివ్ అయ్యాడు. తన సినిమాకు వర్క్ చేసేందుకు హాలీవుడ్ స్టంట్ మాస్టర్ బాబ్ బ్రౌన్ వచ్చాడని.. ఇది తనకు కొత్త అనుభూతిని ఇస్తోందని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా అఖిల్ సినిమాకు ‘ఎక్కడ ఎక్కడ ఉందో తారక’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

To Top

Send this to a friend