బాహుబలి స్ఫూర్తితో.. ముందుకు..

 

 

బాహుబలి రేంజ్ లో మరో సినిమా తీయడానికి బాలీవుడ్ లో అడుగులు పడ్డాయి. బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గణ్ చారిత్రక చిత్రం వైపు అడుగులు వేశాడు. మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ సైన్యంలో సేనాధిపతిగా ఉన్న సుబేదార్ తానాజీ మలుసరే జీవితం ఆధారంగా ‘తానాజీ : ది అన్ సంగ్ వారియర్’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు . ఓమ్ రౌత్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తున్న అజ‌య్ దేవ‌గణ్‌ ఈ సినిమాను ‘బాహుబలి’ కన్నా గొప్ప స్థాయిలో చేయాల‌ని అనుకుంటున్నామే తప్ప‌ బాహుబ‌లికి పోటీగా తీయాలని అనుకోవ‌డం లేద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపాడు.

అజయ్ దేవగన్ మాట్లాడుతూ మనం తీసే చిత్రాల్లో భావోద్వేగాలు, నాటకీయత మొదలైనవి ఎక్కువగా ఉండాలని అన్నారు. అలా తీయలేని పక్షంలో మన సినిమాలను హాలీవుడ్ సినిమాలు భర్తీ చేస్తాయని వ్యాఖ్యానించాడు అజయ్. మొత్తానికి మన బాహుబలి మేనియా భారతదేశ సినిమా రంగాన్నే మర్చిందని.. వచ్చే సినిమాలకు స్ఫూర్తిగా నిలిచిందని చెప్పవచ్చు

ఇన్నాళ్లు మనం వేరే భాషా చిత్రాలవైపు చూసేవాళ్లం. పొరుగింటి పుల్లకూర సామెతను నిరూపించాం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బాలీవుడ్ సైతం మనవైపు చూస్తోంది. అంతేకాదు .. మన ద్వారా ఒక స్ఫూర్తిని పొందిందనిపిస్తోంది. అందరినీ అంతగా ఇన్ స్పైర్ చేసింది బాహుబలి. దీని స్ఫూర్తితో హిందీలో సినిమా రూపొందుతుండడం ఇది నిజంగా మనకు గర్వకారణమే.

To Top

Send this to a friend