మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ఉయ్యాలవాడ కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతుంది. మరో నెల రోజుల్లో చిరంజీవి కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లేందుకు సర్వం సిద్దం అవుతుంది. దర్శకుడు సురేందర్ రెడ్డి మరియు నిర్మాత రామ్ చరణ్‌లు ప్రస్తుతం అందుకు సంబంధించిన కార్యక్రమాల్లోనే ఉన్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ ఒక దశకు రాగా నటీ నటుల ఎంపిక చేసే పరిక్రియ ప్రారంభం అయినట్లుగా తెలుస్తోంది.
మొదటి నుండి కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో ఐశ్వర్యరాయ్‌ను నటింపజేయనున్నట్లుగా వార్తలు వచ్చాయి. అది నిజమే ఆమెను చిత్ర యూనిట్ సభ్యులు సంప్రదించారు. అయితే ఆమె చేయను అని చెప్పకుండానే చేయను అని చెప్పేసిందట. అంటే చిరంజీవిపై గౌరవం ఉంది, ఆయనతో సినిమా చేస్తాను, అయితే 8 కోట్ల పారితోషికం కావాలని ఐశ్వర్య డిమాండ్ చేసిందట. సౌత్ సినిమాకు అంత డిమాండ్ చేయడంతోనే ఆమె చిరుతో నటించేందుకు ఆసక్తిగా లేదు అని తేలిపోయింది.
ఇటీవల ఆమె బాలీవుడ్లో చేసిన ఒక సినిమాకు కేవలం అయిదు కోట్ల పారితోషికం తీసుకుంది. అలాంటిది సౌత్‌లో కాస్త తక్కువ పారితోషికం తీసుకోవాలి. కాని ఆమె బాలీవుడ్లో కంటే ఎక్కువ చెప్పింది అంటే చిరంజీవితో నటించడం ఆమెకు ఇష్టం లేదని చిత్ర యూనిట్ సభ్యులు భావించారు. ఆమెతో ఇంకా కూడా చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతుంది. కాని ఆ చర్చలు సఫలం అయ్యేది మాత్రం అనుమానమే.
