AISFM మాయాబజార్‌ బ్లాక్‌ ప్రారంభం 

mayabazar-apnews
సినిమాకు సంబంధించిన అన్నీ విభాగాల్లో శిక్షణ ఇస్తూ ఇండియాలోనే టాప్‌ మీడియా స్కూల్‌ లక్ష్యం వైపు దూసుకెళ్తున్న సంస్థ అన్నపూర్ణ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫిలిం అండ్‌ మీడియా. అన్నపూర్ణ స్టూడియోలో నెలకొల్పిన ఈ సంస్థలో ఫిలిం మేకింగ్‌, గ్రాఫిక్స్‌ డిజైనింగ్‌, సినిమాటోగ్రఫీ, యానీమేషన్‌, మీడియా మేనేజ్‌మెంట్స్‌లో బ్యాచిలర్‌, మాస్టర్‌ డిగ్రీ శిక్షణా తరగతులను నిర్వహిస్తారు. కమల్‌ హాసన్‌, మణిరత్నం, కరణ్‌జోహార్‌, ఫరాహ్‌ఖాన్‌, అనురాగ్‌ కశ్యప్‌ వంటి ప్రముఖ సినీ సెలబ్రిటీలు అడ్వయిజరీ బోర్డ్‌ మెంబర్స్‌గా వర్క్‌ చేస్తున్నారు. ఈ సంస్థలో మాయాబజార్‌ అనే కొత్త బ్లాక్‌ను సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కలిసి ఆవిష్కరించారు. మంచి శిక్షణా తరగతులు, మంచి వంటగది, ఆహారం, కేఫ్‌టోరియా, ఆడిటోరియం, కాన్ఫ్‌రెన్స్‌ రూమ్‌, స్టాఫ్‌ రూం ఈ బ్లాక్‌లో ఉంటాయి. అన్నపూర్ణ స్టూడియోలోని ఫారెస్ట్‌ ఏరియాలో, ప్రస్తుతం ఉన్న అన్నపూర్ణ ఫిలిం స్కూల్‌ వెనుక భాగాన ఈ కొత్త బ్లాక్‌ను నిర్మించారు. అనంతరం అక్కినేని నాగార్జున, కె.రాఘవేంద్రరావులు స్కూల్‌లోని స్టూడెంట్స్‌ను కలిసి అక్కడ పరిస్థితులు గురించి తెలుసుకున్నారు.
To Top

Send this to a friend