అగ్రిగోల్డ్ కధ ఎంటి?- పవన్ కళ్యాణ్

ఎవరబ్బ సొమ్మని ఇలా దోచుకుంటారు.. ప్రభుత్వంలోని పెద్దల సహకారం లేనిదే ఇన్ని వేల కోట్లు ఎలా కొల్లగొడతారు. జనాల డబ్బులు కాజేసి కుచ్చుటోపీ పెట్టినా కనీసం బాధితులకు రూపాయి తిరిగి ఇవ్వలేని  స్థితిలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయంటే ఇంకా ఎవరికి చెప్పుకోవాలి.. పైగా డబ్బులు కాజేసిన వారిని కాపాడడానికి ప్రభుత్వంలోని పెద్దలు శతవిధాలా ప్రయత్నిస్తుండడం విస్మయం కలిగిస్తోంది..

ఒకటి కాదు రెండు.. జనాల్ని నమ్మించి మోసం చేసి వేలకోట్లు తన్నుకుపోయిన గద్దలు అగ్రిగోల్డ్ యజమానులు.. అప్పనంగా వేలకోట్లు సేకరించి, వాటిని తిరిగి చెల్లించకుండా ఎగవేశారు. దీనిపై బాధితులు రోడ్డెక్కడం వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం స్పందించి అగ్రిగోల్డ్ యజమానులను అరెస్ట్ చేసి జైలు పాలు చేసింది. అయినా కూడా ఈ వ్యవహారం రెండు రాష్ట్రాలు ఉదాసీనంగా వ్యవహరించాయి.. బాధితుల డబ్బుల రికవరీలో నిర్లప్తతగా వ్యవహరించడం చూస్తుంటే ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఈ కుంభకోణంలో ఉన్నట్టే కనిపిస్తోంది..

* అసలు ఏంటీ అగ్రిగోల్డ్ వ్యవహారం..
అగ్రిగోల్డ్ అనే సంస్థను అవ్వా వెంకటరామారావు అండ్ బ్రదర్స్ ఎనిమిది మంది ఏపీలో ప్రారంభించారు. అగ్రిగోల్డ్ పేరు చెప్పి పలు వ్యవసాయ, అగ్రి ఉత్పత్తులు, నూనెల వ్యాపారం, చిట్ ఫండ్ , రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించారు. పేరు  బాగా ప్రచారంలోకి రావడంతో జనాలందరూ ఇందులో చిట్టీల పేరుతో పెట్టుబడులు పెట్టారు. అనంతరం భారీగా జనాల నుంచి డబ్బులు వసూలు చేసి  మోసం చేశారు. అనంతరం నష్టపోయామంటూ డబ్బులు తిరిగి ఇవ్వలేక తప్పించుకున్నారు. దీంతో నష్టపోయిన బాధితులు ఆందోళన నిర్వహించారు. వేల కోట్ల డబ్బుల విషయం కావడంతో ఏపీ ప్రభుత్వం 2015 జనవరిలో అగ్రిగోల్డ్ అక్రమాలపై ఏపీ సీఐడీకి కేసు దర్యాప్తు చేయమని అప్పగించింది.  ఇందుకోసం 2016-17లో బడ్జెట్ లో 50లక్షల రూపాయల బడ్జెట్ ను కేటాయించింది. ఈ కేసులో అవ్వా సోదరుల్లోని ఎనిమిది మందిలో ఇద్దరినే సీఐడీ అరెస్ట్ చేసింది. వేలాది కుటుంబాల జీవితాలతో ముడిపడి ఉన్న కేసుకు సంబంధించి కీలకమైన భూముల పత్రాలను ప్రభుత్వం ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. కానీ ఈ కేసు విషయంలో హైకోర్టు ఆదేశించే వరకు కూడా ఏపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్ యజమానులను అరెస్ట్ చేయకపోవడం అనుమానాలకు తావిచ్చింది.

*అగ్రిగోల్డ్ నిందితులకు ప్రస్తుతం గుండెపోటు..
వేలకోట్లు కాజేసి ప్రజాదోంళన తీవ్రమవడంతో అగ్రిగోల్డ్ యజమానులకు గుండెపోటు వచ్చింది..వీరిని విజయవాడకు అనంతరం హైదరాబాద్ తరలించి సేవ చేస్తున్నారు.అది అసలైన గుండెనొప్పా.. లేక ఏపీలో ఆందోళనలక జడిసి ఏపీ ప్రభుత్వం నిందితులు హైదరాబాద్ మకాం మార్చారా అన్న దానిపై సందేహాలున్నాయి. ఒకటి మాత్రం స్పష్టం అగ్రిగోల్డ్ యజమానులకు ఏపీ ప్రభుత్వం సహకారం లేనిదే నిందితులు ఇంత దర్జాగా గుండెనొప్పి పేరుతో నాటాకాలు ఆడరని విమర్శలున్నాయి.

*అగ్రిగోల్డ్ అవినీతిలో బాబుకు వాట..
అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు ఉదాసీనంగా వ్యవహరించారు. మంత్రి పత్తిపాటి అండ్ కొందరు మంత్రులు అగ్రిగోల్డ్ నుంచి చౌకగా భూములు కొన్నారు. లక్షలాది మధ్యతరగతి జనం దగ్గర లక్షలు వసూలు చేసి ఇష్టానుసారం ఆస్తులు కూడబెట్టిన అగ్రిగోల్డ్ యజమానులకు చంద్రబాబు సర్కారు, ఆయన మంత్రులు అడుగడుగునా అండదండలు అందిస్తున్నారు. అందుకే వారిని హైకోర్టు ఆదేశించేదాకా కూడా చంద్రబాబు సర్కారు అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు జైల్లో ఉన్నవారిని ప్రజాందోళనలు తీవ్రం అయ్యే సరికి గుండెనొప్పి పేరు చెప్పి హైదరాబాద్ నిమ్స్ కు తరలించి రాజబోగాలు అనుభవించేలా చేస్తోంది. ఈ కుంభకోణంలో ఏపీ సీఎం చంద్రబాబు, అండ్ మంత్రులకు ప్రమేయం ఉందనడానికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదు..

*అగ్రిగోల్డ్ వ్యవహారంలో జగన్ రాంగ్ స్టెప్
అగ్రిగోల్డ్ వ్యవహారంలో జగన్ తప్పటడుగులు వేశారు. అగ్రిగోల్డ్ కు సంబంధించి అసెంబ్లీలో మంత్రి పత్తిపాటి పుల్లారావుకు మొదట ప్రమేయం ఉందని.. ఆయన అగ్రిగోల్డ్ నుంచి భూములు కొన్నాడని జగన్ ఆరోపించారు. అనంతరం దీనిపై స్పందించిన ఏపీ సీఎం, మంత్రి నిరూపిస్తే రాజకీయాలనుంచి వైదొలుగుతానని జగన్ కు సవాల్ విసిరారు. అయినా కూడా దీన్ని నిరూపించడంలో అసెంబ్లీలో ఫైట్ చేయడంలో జగన్ ఫెయిల్ అయ్యారు. వ్యవహారాన్ని నీరుగార్చారు. అంతేకాదు.. అగ్రిగోల్డ్ కేసును సీబీఐకి అప్పగించాలని జగన్ డిమాండ్ చేయడమే పెద్ద తప్పటడుగు.. అగ్రిగోల్డ్ కేసు సీబీఐకి అప్పగిస్తే డిపాజిటర్లకు ఒక్క రూపాయి రాదు. సీబీఐ చేతుల్లోకి వెళ్లిన ఏ కేసులోనూ డిపాజిటర్లకు ఒక్క రూపాయి కూడా రాలేదని.. ఈ రకంగా బాధితులకు జగన్ డిమాండ్ ఆశనిపాతం అని నిపుణులు విమర్శిస్తున్నారు.  జగన్ రాజకీయంగా అలజడి సృష్టించడానికి సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసినా.. సీబీఐ కేసు ఎన్నేళ్లకు తేలునో.. తేలినా డబ్బులు ఇవ్వరనేది జగమెరిగిన సత్యమే.. ఈ విషయం తెలిసి కూడా జగన్ డిమాండ్ చేయడం ఆసక్తికరంగా మారింది.  జగన్ తన రాజకీయ లబ్ది కోసం డిపాజిట్ దార్లను నట్టేట ముంచేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

*లేటుగా రంగంలోకి ‘పవనా’లు..
లేటుగా అయినా లేటెస్టుగా అగ్రిగోల్డ్ బాధితుల కోసం పోరాడేందుకు పవన్ రంగంలోకి దిగారు.  చంద్రబాబుపై బాణంలా దూసుకువచ్చేందుకు ప్లాన్ రెడీ చేాడు. అగ్రిగోల్డ్ బాధితుల తరఫున పోరాడేందుకు జగన్ ఉగాది తెల్లవారి గురువారం విజయవాడ బయలుదేరుతున్నారు. ఇది వరకు ఏపీలోని సమస్యలపై పవన్ సంధించిన ప్రశ్నలకు వేగంగా స్పందించిన చంద్రబాబు ఇప్పుడు ఈ అగ్రిగోల్డ్ వ్యవహారంలో పవన్ ప్రశ్నలకు బాబు ఏం సమాధానం చెబుతాడోనన్న ఆసక్తి నెలకొంది. అయితే పవన్ అగ్రిగోల్డ్ ఉద్యమం వెనుక భారీ వ్యూహరచనే చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఈ విషయంలో వైసీపీ చురుగ్గా వెళ్లి వెనక్కి తగ్గడంతో దీన్ని తలెకెత్తుకొని పవన్ మైలేజీ పొందడానికి ప్రయత్నిస్తున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు. లేట్ అయినా పవన్ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు పోరుబాట పట్టాడని అంచనావేస్తున్నారు. ఇప్పటికే పవన్ కంటే ముందే విజయవాడ  తుమ్మళపెల్లి కళాక్షేత్రానికి వెళ్లిన జనసేన నాయకులు అక్కడి బాధితులతో సమాలోచనలు జరిపారు.. ఈ నయా మోసానికి సంబంధించి అన్ని వివరాలు సేకరించారు. ఈ వివరాలను పట్టుకొని స్క్రిప్ట్ పక్కాగా సిద్ధం చేసుకొని గురువారం పనవ్ విజయవాడలో చంద్రబాబు అండ్ ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నవారిని కడిగేయనున్నారు. పవన్ పోరుతోనైనా చంద్రబాబు సర్కారు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తుందా లేదా సైలెంట్ అవుతుందా అన్నది ఉత్కంఠగా మారింది. అయితే జగన్ తో పోలిస్తే పవన్ ఆందోళనలకు మైలేజీ ఎక్కవగా వస్తుందనడంలో సందేహం లేదు. ఈ పవన్ దెబ్బకు ప్రభుత్వంలో కొంతైనా కదలిక వచ్చి బాధితులకు న్యాయం జరిగితే అదే పదివేలు..

To Top

Send this to a friend