అగ్రిగోల్డ్ చైర్మన్ కు గుండెపోటు: అసలు కథేంటి.?


వారిద్దరు జనాల సొమ్మును అప్పనంగా కాజేశారు. తిరిగి ఇవ్వకుండా మోసం చేశారు. ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపడంతో కేసు నమోదై జైలు పాలయ్యారు. ప్రస్తుతం ఈ అగ్రిగోల్డ్ వ్యవహారంలో ప్రభుత్వ జోక్యం ఉందని.. వారిని రక్షించేందుకు టీడీపీ మంత్రులు, సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని.. వైఎస్ జగన్ ఆరోపించారు. ఇదే వ్యవహారంపై అసెంబ్లీలో హాట్ హాట్ చర్చ జరిగింది. మంత్రి పత్తిపాటి పుల్లారావు.. అగ్రిగోల్డ్ నుంచి భూములు తక్కువకు కొన్నారని జగన్ టీం ఆరోపించింది. అసెంబ్లీలో దీనిపై సవాళ్లు ప్రతిసవాళ్లు నడిచాయి..

ఈ నేపథ్యంలోనే సోమవారం అగ్రిగోల్డ్ చైర్మన్, ఎండీలకు హఠాత్తుగా గుండెపోటు రావడం అనుమానాలకు తావిచ్చింది. చైర్మన్ అవ్వా వెంకట రామారావు, ఎండీ వెంకట శేషునారాయణ రావు ఏలురూ జైలులో గుండెపోటుకు గురయ్యారు. వారిని తొలుత విజయవాడకు.. ఆ తర్వాత హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు.

అయితే అసెంబ్లీలో అగ్రిగోల్డ్ పై చర్చ జరగడం.. జగన్ పోరుబాటకు పూనుకోవడం.. వీరిద్దరు ఏపీలో ఉంటే మరింత ఆందోళనలు రేకెత్తుతాయనే సాకుతోనే హైదరాబాద్ నిమ్స్ కు ప్రభుత్వం వ్యూహాత్మకంగా తరలించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కావాలనే వారిని జైలునుంచి బయటకు తీసుకురావడం.. హైదరాబాద్ తరలించడం చేశారని విమర్శలు వస్తున్నాయి.

To Top

Send this to a friend