మళ్లీ కొత్తనోట్లు!

 

పెద్ద నోట్ల రద్దు.. దేశవ్యాప్తంగా మోడీ తీసుకున్న అతిపెద్ద సాహస నిర్ణయం. ఆ కష్టాలు ఇప్పటికీ వెంటాడుతున్నాయి. ఏటీఎంలలో ఇప్పటకీ నగదు కొరతతో జనం అష్టకష్టాలు పడుతున్నారు. బ్యాంకుల్లో పెద్దగా డబ్బులు ఇవ్వడం లేదు. దీంతో నోట్ల కష్టాలు తీరడం లేదు.

కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కొత్తగా దేశంలోకి రూ.500 నోటును తీసుకొస్తోంది. ఇప్పటికే ఉన్న 500 నోటును కొనసాగిస్తూనే అందులో కొన్ని మార్పులు తీసుకొస్తోంది. 500 నోటుపై కొత్త బ్యాచ్ తో పాటు A అనే అక్షరంతో కలిపి వీటిని విడుదల చేస్తున్నారు. దీనిపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం, ముద్రించిన సంవత్సరం 2017 అనే ముద్ర ఉంటుంది.

ఈ డిజైన్ రూపొందించి మోడీ ఆమోదం కోసం పంపారు. మోడీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే జూన్ నుంచి జనంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలను ఆర్బీఐ చేస్తోంది.. ఇప్పటికే నగదు సమస్యతో కొట్టుమిట్టాడుతున్న జనానికి ఇప్పుడు మరోసారి మరో 500 కొత్త నోటు వస్తుండడంతో జనం ఆందోళన చెందుతున్నారు.

To Top

Send this to a friend