రాజమౌళి తర్వాత ఈయనే..

తెలుగులో ఇప్పుడు టాప్ దర్శకుడు ఎవరు.? అంటే ఖచ్చితంగా బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించిన దర్శకదీరుడు రాజమౌళి పేరు చెబుతారు. రాజమౌళి తెలుగులోనే కాదు దేశవ్యాప్తంగా కూడా పేరుపొందారు. ఇక రాజమౌళిని మినహాయిస్తే ప్రస్తుత విజయాల ప్రకారం రెండో ప్లేస్ ఖచ్చితంగా దర్శకుడు కొరటాల శివ దే అనడంలో ఎలాంటి సందేహం లేదు..

కొరటాల శివ.. మిర్చితో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు. మొదట ఆయన రచయిత.. మెల్లగా ఎలాగోలా మిర్చి సినిమాతో దర్శకుడిగా మారారు. తొలిచిత్రంతోనే విజయాన్ని అందుకొని ఇండస్ట్రీని ఆకర్షించాడు. తరువాత మహేశ్ బాబు ను మంచి కథతో ఒప్పించి శ్రీమంతుడు సినిమా తీశాడు. సోషల్ మెసేజ్ తో పాటు కమర్షియల్ హంగులు జోడించి ఆ సినిమాను హిట్ కొట్టించాడు. మహేశ్ నుంచి ఓ పెద్ద బెంజ్ కారును కూడా బహుమతిగా పొందాడు. జనతా గ్యారేజ్ సినిమాతో ఎన్టీఆర్ కు కూడా హిట్ ఇచ్చిన దర్శకుడు కొరటాల శివ రెమ్యూనరేషన్ ఇప్పుడు భారీగా పెంచేశాడట..

ఇలా మంచి కథలతో ముందుకు దూసుకెళ్తున్న కొరటాలకు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎదురులేకుండా పోయింది. ఈ దర్శకుడి ప్రతిభ చూసి నిర్మాతలు కూడా అంత ఇచ్చేందుకు ముందుకు రావడం విశేషం. ప్రస్తుతం కొరటాల శివ మహేశ్ బాబుతో కలిసి ‘భరత్ అనే నేను’ అనే పొలిటికల్ సెటైర్ మూవీని తీయబోతున్నాడు. ఈ సినిమా ప్రారంభం కాకముందే మరోసినిమాను కొరటాల అంగీకరించారు.

ఇటీవలే రాంచరణ్ తో ఓ సినిమా చేయడానికి కొరటాల శివ ఓకే చెప్పాడు. ఆ సినిమాను రాంచరణ్ తో పాటు మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు కలిసి నిర్మిస్తాయి. ఈ సినిమాకు గాను కొరటాల రూ. 14 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడట.. రాజమౌళి తరువాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంతఅత్యధిక మొత్తం తీసుకున్న దర్శకుడిగా కొరటాల నిలిచిపోయారు. మూడు వరుస హిట్ లు కొట్టడంతో ఇప్పుడు కొరటాల పారితోషికమే హీరోను మించిపోయిందనే టాక్ వినిపిస్తోంది. స్టార్ హీరో కూడా ఇంత మొత్తం తెలుగులో పారితోషికం తీసుకోడని సినీ జనాలు వ్యాఖ్యానిస్తున్నారు.

To Top

Send this to a friend