కిక్ బాక్సర్స్, మల్ల యోధులు, యుద్ధ విద్యల్లో తర్ఫీదు పొందేవారు ఎక్కువగా తినే పదార్థం ‘మొలకెత్తిన గింజలు..’ తృణధాన్యాలను నానబెట్టి అవి మొలకలు వచ్చే వరకు నీటిలో తడిపి నానబెడతారు. మొలకలు రాగానే వాటిని తింటారు. దీని వల్ల శరీరానికి కావాల్సిన ఎన్నో విటమిన్లు, మినరల్స్ మనకు అందుకు అందుతాయి. ఎంతో బలవర్ధక ఆహారమైన మొలకెత్తిన గింజలు తినడం వల్ల మనకు చాలా లాభాలు కలుగుతాయని ఎన్నో పరిశోధనల్లో తేలింది.
మన శరీరానికి అవసరమైన కీలక పోషకాలను అందించడంలో ఇవి ప్రముఖ పాత్ర వహిస్తాయి. దీంతోపాటు జీర్ణ సంబంధ సమస్యలు పోతాయి. శరీరానికి శక్తి అందుతుంది. విటమిన్ ఎ, బి6,సి,కె, ఫైబర్,మాంగనీస్,రైబో ఫ్లేవిన్, కాపర్,థయామిన్, నియాసిన్, పాంటోథెనిక్ యాసిడ్,ఐరన్, మెగ్నిషియం లాంటి విటమిన్లు, పోషకాలు మొలకెత్తిన గింజల్లో ఉంటాయి.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పోషకాలు మనకు అందుతాయి.అయితే మొలకెత్తిన గింజలను చాలా మంది ఎప్పుడు పడితే అప్పుడే తింటారు. కానీ అలా కాదు,వాటిని కూడా నిర్దిష్టమైన సమయంలోనే తినాలి. మొలకెత్తిన గింజలను ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌కు ముందుగా తీసుకోవాలి. అలా తీసుకుంటేనే వాటి వల్ల మనకు ఎక్కువ లాభాలు కలుగుతాయి. ఎందుకంటే ఉదయం పూట శరీరానికి శక్తి చాలా అవసరం.ఈ క్రమంలో వాటిని తింటే తగినంత శక్తి లభించడమే కాదు,జీర్ణ సమస్యలకు చక్కని పరిష్కారం లభిస్తుంది.
అలా కాకుండా సాయంత్రం,రాత్రి పూట తింటే మొలకెత్తిన గింజల్లో ఉండే పదార్థాలు సరిగ్గా జీర్ణం కావు.దీంతో మనకు పోషణ సరిగ్గా లభించదు. కనుక వాటిని ఉదయాన్నే తినడం అలవాటు చేసుకుంటే గరిష్టంగా ప్రయోజనాన్ని పొందవచ్చు..!
