అధికారం రాదు ….


అతిగా ఆశపడే మొగాడు.. అతిగా ఆవేశపడే ఆడది బాగుపడదని ఫేమస్ డైలాగ్.. ఈ డైలాగు వైఎస్ జగన్ కు.. ఆయన అభిమానులకు సరిగ్గా సరిపోతుంది. ఆలూ లేదు చూలు లేదు కానీ వచ్చేసారి జగనే సీఎం అని ఊదరగొట్టే ఆయన అనుంగ పరివారం చేష్టలు జుగుప్సాకరంగా ఉంటున్నాయి. నిజంగా చెప్పాలంటే ఏపీలో జగన్ ను ఓడించడానికి ఏ చంద్రబాబో.. పవన్ రావాల్సిన పనిలేదు.. జగన్ అభిమానులు, జగన్ మొండితనం.. ఆయన నాయకుల నిర్లక్ష్య ధోరణి చాలు.. వాళ్లకు వాళ్లే ఓడిపోవడానికి ..

*దూకుడు పనికిరాదు ‘జగనా’లు
రాజకీయాల్లో ఎంతో ఓర్పు నేర్పు అవసరం.. జగన్ తండ్రి 20ఏళ్లు కాంగ్రెస్ ను పట్టుకొని కార్యకర్త నుంచి పీసీసీ పదవి వరకు అందరికి సేవ చేసి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన మరణించగానే వెంటనే గద్దెనెక్కుదామనుకున్న జగన్ కు కాలం కలిసిరాలేదు.. పోనీలే అని ఊరుకుంటే సీఎం అయ్యేవాడు.. రోశయ్యను సీఎం చేశాడని అలిగి తొందరపడి వైసీపీ పెట్టి అష్టకష్టాలు పడ్డాడు. కేసుల్లో జైలు కెళ్లాడు. అదే కొద్దిరోజులు కాంగ్రెస్ తోనే ఉంటే రోశయ్య తరువాత సీఎం అయ్యేవాడే.. మధ్యలో కానీ కాలం కలిసివచ్చి కిరణ్ కుమార్ రెడ్డి అయ్యారు. వైఎస్ 20 ఏళ్లు ఆగితే.. కొడుకు కనీసం సంవత్సరం కూడా ఆగలేదు.  ఓపిక లేక జగనాలు ఇలా కష్టాలు పడుతున్నాడు..

*జగన్ పరివారందీ అదే తీరు..
కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పవన్ పై వైఎస్ జగన్ అభిమానులు విష ప్రచారం చేస్తున్నారు. అదే పనిగా దుమ్మెత్తిపోస్తున్నారు. జగన్ కు పోటీగా ఏపీ రాజకీయాల్లోకి రావడంతో వైఎస్ జగన్ అభిమానులు పవన్ ను టార్గెట్ చేశారు. ఇది జగన్ ప్రోద్బలంతోనే జరుగుతోందనేది ఇన్ సైడ్ టాక్.. పవన్ ను టార్గెట్ చేయడం వల్ల అంతిమంగా జగన్ కే లాస్.. ఎందుకంటే ఏపీలో ఉన్న బలమైన సామాజికవర్గం కాపులు.. వారి ప్రతినిధిగా పవన్ రాజకీయాల్లోకి వస్తున్నారు. గత సారి కాపులు చంద్రబాబుకు సపోర్టు చేయడం వల్లే ఆయనకు అధికారం సాధ్యమైంది. కానీ కాపులకు చంద్రబాబు అన్యాయం చేయడం.. కాపు ఉద్యమ నేత ముద్రగడను చంద్రబాబు అణిచివేశాక.. కాపులందరూ జగన్ వైపు వెళ్లారు. కానీ ఇప్పుడు కాపు సామాజిక వర్గ పవన్ కు వారి సపోర్టు ఉంది. ఈ సమయంలో పవన్ తో.. కాపులతో ఎంతమంచిగా ఉంటే జగన్ కు అంత లాభం.. పవన్ తో పొత్తు పెట్టుకున్నా వచ్చే ఎన్నికల్లో జగనే సీఎం అయ్యే చాన్స్ ఉంది. ఇంతటి సున్నితమైన అంశాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా పవన్ ను టార్గెట్ చేయడంతో కథ అడ్డం తిరుగుతోంది. జగన్ పార్టీలో ఉన్న కాపు, రెడ్డి నాయకులు సైతం పవన్ ను విమర్శించడాన్ని వ్యతిరేకేస్తుండడం గమనార్హం. పవన్ పై విష ప్రచారం చేస్తే అంతిమంగా లాస్ అయ్యేది జగనే అని ఆయన ఫ్యాన్స్ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది..

*కాపులు పోయారు.. బీసీలొచ్చారు..
చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కుల, ప్రాంత సమీకరణాలు ఆలోచించి ఎలాగూ కాపులు దూరం కావడంతో ఇప్పుడు బీసీపై పడ్డారు. ఇటీవలే ఎమ్మెల్సీ నామినేటెడ్ ఎన్నికల్లో బీసీ నేత.. పద్మశాలి సామాజికవర్గానికి చెందిన పోతుల సునీతకు అవకాశం కల్పించి బీసీల్లో ఓటు బ్యాంకును పెంచుకున్నారు. అంతేకాదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ కు ఆదినుంచి బలం ఉన్నా రెడ్డి సామాజికవర్గం వారిని తనవైపు తిప్పుకోవడానికి చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు మెజార్టీ సీట్లు రెడ్డిలకే ఇచ్చి వారి ఓటుబ్యాంకును మలుచుకున్నారు. ఇలా చంద్రబాబు బీసీ-రెడ్డి వర్గాలను మచ్చికచేసుకుంటుంటే జగన్ మాత్రం తన వెంట ఉన్న కాపులు, రెడ్డిలను దూరం చేసుకుంటూ పెద్ద తప్పు చేస్తున్నారు.

మొత్తంగా జగన్ తప్పటడుగులు ఏపీలో రాజకీయంగా ఆయనకు నష్టం చేకూరుస్తున్నాయి. చంద్రబాబుపై పోరాడుతున్న పవన్ తో దోస్తీ చేయడం మాని.. దూరం చేసుకుంటున్నారు. నమ్ముకున్నళ్లకు పొగ బెట్టి వెళ్లగొడుతున్నారు. ఇలాచేస్తుంటే.. జగన్ వచ్చే 2019లో కాదు కదా.. మరో పదేళ్లయినా అధికారంలోకి రాకుండా చేసుకుంటున్నాడు.

To Top

Send this to a friend