81లక్షల ఆధార్ కార్డుల రద్దు..

పుడితే ఆధార్.. చస్తే ఆధార్.. కాలు బయటపెడితే ఆధార్.. భారత దేశంలో బతకడానికి తిండిలేకపోయినా ఫర్వాలేదు.. కానీ.. ఆధార్ నంబర్ మాత్రం కంపల్సరీ.. రేషన్ కు ఆధార్, రైల్వే ప్రయాణానికి ఆధార్, బతకడానికి ఆధార్, చచ్చినా ఆధారే.. అన్నింటికి మన ప్రభుత్వం ఆధార్ ను లింక్ పెట్టేసింది. దీంతో ఇప్పుడు బయటకు వెళితే ఆధార్తీసుకుపోకుండా జనం ఉండలేకపోతున్నారు.. ఈ మధ్యన్నే పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్) కార్డులు దాదాపు 12 లక్షల వరకు రద్దు చేసి ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ దేశం మొత్తాన్ని అలర్ట్ చేసింది. ఎన్ని గడువులు ఇచ్చినా ఆధార్ కు పాన్ ను లింకు చేసుకోవడంలో పబ్లిక్ అలసత్వం ప్రదర్శిస్తుండడంతో ఈ రూపంలో జర్క్ ఇచ్చింది.
దీంతో తమ పాన్ ఉందో? ఎగిరిపోయిందో? తెలుసుకునేందుకు చాలా మంది వెతుక్కునే పనిలోపడ్డారు. దీంతో ఆ సైట్ డెడ్ స్లో అయిపోయింది. దీనికి తోడు ఆగస్టు 31లోపు పాన్ కు ఆధార్ ను లింక్ చేయకుంటే పాన్ కార్డులు రద్దు అవుతాయని చెప్పడంతో అంతా తెగ టెన్షన్ పడుతున్నారు. ఈలోపు ఆధార్.. అదే యునీక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సంస్థ బాంబు పేల్చింది. ఇప్పటివరకూ పలు కారణాలతో 81 లక్షల ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేసింది. ఆధార్ లైఫ్ సైకిల్ మేనేజ్ మెంట్ లోని నిబంధనల కింద వీటిని చెల్లుబాటు కాకుండా చేసినట్టు తెలిపింది. ఇక ఈ జాబితాలో మీ ఆధార్ కార్డు ఉందా? అన్న విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే, మీరు యూఐడీఏఐ వెబ్ సైట్ ను సందర్శించాల్సి వుంటుంది.
ఇందుకోసం.. https://resident.uidai.gov.in/aadhaarverification ఈ వెబ్ లింక్ కు వెళ్లి, అక్కడ 12 అంకెల ఆధార్ సంఖ్యను, ఆపై సెక్యూరిటీ కోడ్ ను టైప్ చేయాలి. ఆ తరువాత వెరిఫై బటన్ ను నొక్కితే, మీ కార్డు యాక్టివ్ గా ఉందా? లేక డీయాక్టివేట్ అయిందా? అన్న విషయం తెలుస్తుంది. యాక్టివ్ గా ఉంటే, మీ వయసు, రాష్ట్రం, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లోని చివరి మూడు అంకెలు కనిపిస్తాయి. ఒకవేళ మీ ఆధార్ చెల్లుబాటులో లేకుంటే, స్క్రీన్ పై ఎటువంటి వివరాలూ కనిపించవు
To Top

Send this to a friend