రీ రిలీజ్‌ ఒక పిచ్చి ప్రయత్నం

ఎక్కువ సినిమాలు రీ రిలీజ్‌ అయ్యేవి. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, చిరంజీవి వంటి స్టార్స్‌ సినిమాలు లెక్కకు మించి రీ రిలీజ్‌లు అయ్యాయి. అయితే అప్పుడు టీవీ ఛానెల్స్‌ ఈ స్థాయిలో లేవు. అందుకే సినిమాలు మళ్లీ మళ్లీ రిలీజ్‌ చేసినా కూడా చూశారు. కాని ప్రస్తుతం వందల సంఖ్యలో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్స్‌ ఉన్నాయి. ఆ ఛానెల్స్‌లో ఒక్కో సినిమా వందల సార్లు వస్తుంది. ఇలాంటి సమయంలో సినిమా రీ రిలీజ్‌ అనే ఆలోచనే ఏ ఒక్క ఫిల్మ్‌ మేకర్‌కు రావడం లేదు. కాని తమిళ ప్రముఖ నిర్మాత కళ్లై పులిథాను మాత్రం ఒక సినిమాను రీ రిలీజ్‌ చేసేందుకు కోట్లు ఖర్చు చేస్తున్నాడు.

కమల్‌ హాసన్‌ హీరోగా రవీన టాండన్‌, మనీషా కోయిరాలు హీరోయిన్స్‌గా సురేష్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కి 2001 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అభయ్‌’ చిత్రాన్ని రీ రిలీజ్‌ చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ సినిమా టెక్నికల్‌గా మరియు క్యాస్టింగ్‌ పరంగా అప్పట్లో విమర్శల ప్రశంసలు అందుకుంది. కాని కమర్షియల్‌గా మాత్రం సక్సెస్‌ కాలేదు.

ఇప్పుడు ఆ సినిమా తప్పకుండా ఆడుతుందనే నమ్మకంతో నిర్మాత ఉన్నాడు. ఆ సినిమాకు కాస్త టెక్నాలజీని జత చేసి కొత్త హంగులతో తమిళనాడు వ్యాప్తంగా దాదాపు 500 థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా రీ ఎడిటింగ్‌ మరియు కర్‌ ఎడిటింగ్‌ వంటి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటుంది. ఎప్పుడు ఈ సినిమా విడుదల కానుంది అనేది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా రీ రిలీజ్‌లో కూడా ఆకట్టుకోవడం కష్టమే అని అంటున్నారు.

To Top

Send this to a friend