భరత్‌కు కూలీతో అంత్యక్రియలు.. ఎందుకు ఇలా?

రవితేజ సోదరుడు భరత్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై కారు ప్రమాదంలో మరణించిన విషయం తెల్సిందే. ఆయన మృతదేహంను ఆయన సోదరుడు రవితేజ మరియు తల్లి ఇతర కుటుంబ సభ్యులు కనీసం చూసేందుకు కూడా ఆసక్తి చూపించక పోవడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. ఎంత దుర్మార్ఘుడు అయినా, ఎంత చెడిపోయినా కూడా చనిపోయిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు కనీస ఫార్మాల్టీ పాటించాల్సిందే. కాని భరత్‌ విషయంలో అదేం జరగలేదు.

భరత్‌ మృతదేహంను ఉస్మానియా హాస్పిటల్‌ నుండి నేరుగా స్మశాన వాటికకు తరలించారు. అక్కడికి రవితేజ కుటుంబ సభ్యులు వస్తారేమో అని మీడియా మరియు కొందరు అనుకున్నారు. కాని చనిపోయిన భరత్‌ను చూసి తట్టుకునే శక్తి లేక పోవడంతో రవితేజ మరియు అతడి కుటుంబ సభ్యులు చూసేందుకు రావడం లేదు అంటూ కొందరు చెప్పుకొచ్చారు. రవితేజ మరో సోదరుడు రఘు మాత్రమే అక్కడ ఉండి కార్యక్రమాలు చూసుకున్నాడు.

రఘు ఈ తతంగం అంతా జరిపించాడు. కాని భరత్‌ చితికి మాత్రం నిప్పు అంటించేందుకు ఆసక్తి చూపించలేదు. ఒక కూలీకి 1500 రూపాయలు ఇచ్చి భరత్‌కు అతడితో అంత్యక్రియలు చేయించడం జరిగింది. ఇంత దారుణం ఏంటి, భరత్‌ విషయంలో రవితేజ ఎందుకు ఇలా ప్రవర్తించాడు అనేది టాలీవుడ్‌ మొత్తం ముక్కున వేలేసుకుని మరీ ఆశ్చర్య పోతున్నారు. జీవితంలో సరిదిద్దుకోలేని తప్పును రవితేజ చేశాడు అంటూ ఆయన సన్నిహితులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

To Top

Send this to a friend