300 చిత్రాల్లో నటించా.. బాహుబలి పెద్ద లెక్క కాదు.

బాహుబలిలో శివగామి పాత్ర చేయాలని మొదట రాజమౌళి శ్రీదేవినే సంప్రదించారు. ఆమె భారీగా డిమాండ్లు పెట్టడంతో ఆ పాత్ర రమ్యక్రిష్ణకు దక్కింది. రమ్యక్రిష్ణ శివగామిగా జీవించి విమర్శకుల ప్రశంసలు పొందింది. నిజంగా శ్రీదేవి కూడా అంతా బాగా చేసేది కాదేమో అన్నట్లు నటించింది. మరి అలాంటి పాత్ర ఒదులుకున్నందుకు శ్రీదేవిని చాలా సార్లు మీడియా ప్రశ్నించింది. కానీ ఎప్పుడూ నో కామెంట్ అని సమాధానమిచ్చిన శ్రీదేవి ఎట్టకేలకు సమాధానమిచ్చింది.

శ్రీదేవి నటించిన తాజా చిత్రం మామ్ ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన శ్రీదేవిని ఇక్కడి మీడియా ప్రతినిధులు శివగామి కోసం భారీగా డిమాండ్ చేశారట కదా అని ప్రశ్నించారు. 8 కోట్లు, బిజినెస్ క్లాస్ విమాన టిక్కెట్లు, స్టార్ హోటల్లో బస, బాహుబలి హిందీ వెర్షన్ లో వాటా అడిగారట.. ఈ విషయాన్ని రాజమౌళియే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడని మీడియా ప్రతినిధులు స్వయంగా ప్రశ్నించే సరికి రాజమౌళిపై విరుచుకుపడింది నటి శ్రీదేవి..

రాజమౌళి ప్రవర్తన ఏమాత్రం బాగాలేదని శ్రీదేవి విమర్శించింది. ఓ ఆర్టిస్ట్ రెమ్యునరేషన్ గురించి పబ్లిగ్గా మాట్లాడే హక్కు ఏ సినీ దర్శకుడికి, నిర్మాతకు లేదని స్పష్టం చేసింది. బాహుబలియే కాదు.. ఎన్నో హిట్ సినిమాలను తన వ్యక్తిగత కారణాల వల్ల వదులుకున్నాను. అయితే రాజమౌళిలా ఎవరూ నా గురించి విమర్శలు చేయలేదు. ఒక సినిమాను అంగీకరించే హక్కు, తిరస్కరించే హక్కు తనకు లేదా అని శ్రీదేవి ప్రశ్నించింది. ఎక్కువ డిమాండ్ పెట్టానన్న రాజమౌళి మాటలు నిజమైతే.. నేను 300 సినిమాలు చేసేదాన్నా అని ప్రశ్నించింది. ఇలా రాజమౌళి తనపై చేసిన విమర్శలకు ధీటుగా బదిలిచ్చి కౌంటర్ ఇచ్చింది శ్రీదేవి.

To Top

Send this to a friend