అబ్బ, జెబ్బ.. కేసీఆర్ దెబ్బ


కేసీఆర్ ను కలవడానికి వివిధ జిల్లాల నుంచి రైతులు సీఎం నివాసమైన ప్రగతి భవన్ కు వచ్చారు. వారితో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ యథాలాపంగా ఓ గొప్ప పథకాన్ని ప్రకటించారు. కేసీఆర్ కసరత్తు చేశారో లేదో తెలియదు కానీ ఈ ఒక్క పథకం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా రైతుల్ని సంతోషంలో ముంచెత్తుతోంది.

వ్యవసాయం దండగ అయ్యింది. ఆరుగాలం శ్రమించినా అతివృష్టి, అనావృష్టి, వడగండ్ల నష్టం, ఇలా అనేక కష్టాల మధ్య వ్యవసాయమే జీవనాధారమైన అన్నదాతలు ఆటుపోట్లకు గురవుతున్నారు. ఈ రైతుల కష్టాలు తీర్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఖరీఫ్ సాగుకు ముందే ఎరువులకు కావాల్సిన డబ్బులు ఎకరానికి నాలుగు వేల చొప్పున రైతు ఖాతాల్లో జమ చేయడానికి కేసీఆర్ నిర్ణయించారు. ఇది రైతుల్లో ఆనందం నింపింది.

అయితే ఈ వివాదంలోకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చేసింది. ఇది తాము వచ్చే ఎన్నికల కోసం ప్రణాళికలో అనుకున్న పథకమని.. కేసీఆర్ దీన్ని హైజాక్ చేసి ముందుగా ప్రకటించారని.. టీకాంగ్రెస్ నేతలు లబోదిబోమన్నారు. కేసీఆర్ కు అన్ని అందించేందుకు ఇప్పటికే టీ కాంగ్రెస్ లో ఆయన దూతలు ఉన్నారన్నది బహిరంగ రహస్యమే.. ఇప్పుడు వారందించిన పథకాన్ని కేసీఆర్ ప్రకటించేసి కాంగ్రెస్ నేతలకు షాక్ ఇచ్చారు. తెలంగాణ రైతుల్ని సంభ్రమాశ్చాలకు గురిచేశారు.

To Top

Send this to a friend