ఆయన లేకుంటే బాహుబలి పూరయ్యేది కాదు..


బాహుబలి ఆడియో వేడుకలో రాజమోళి మైక్ అందుకున్న మొదట థ్యాంక్స్ చెప్పింది రామోజీ రావుకే.. అందులో చాలా అర్థముంది.. రామోజీ రావు గారు తనకు సినిమా తీసుకోవడానికి ఫిలింసిటీలో స్థలం ఇచ్చారని.. అంతేకాకుండా ఇప్పుడు ఆడియో వేడుక జరగడానికి సహకరించారని చెప్పారు. అంతేకాకుండా ఈ సినిమా ఇంత ‘భారీగా’ పూర్తికావడానికి రామోజీరావు గారి సహకారం చాలా ఉందని థ్యాంక్స్ చెప్పారు రాజమౌళి..

అయితే రామోజీరావు బాహుబలికి సినిమా కోసం ఎంతో చేశారు. ఫిలింసిటీ షూటింగ్ కోసం పెద్ద ఎత్తున 5 ఏళ్లుగా స్థలం కేటాయించారు. సెట్టింగుల నిర్వహణను చూశారు. అంతేకాదు.. ఇప్పుడు నిర్మాతలు చెబుతున్న 400 కోట్ల బడ్జెట్ లో మెజారిటీ కోట్లు రామోజీ రావు అందించిన సాయమేనని విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుత నిర్మాతలు శోభు, ప్రసాద్ లవద్ద సినిమా నిర్మాణం కోసం మొదట 150 కోట్లు మాత్రమే సమకూర్చారు. కానీ ఈ రెండు పార్ట్ లు మరింత బాగా తీయడానికి వారికి ఇంకా డబ్బు అవసరం అయ్యింది. అప్పుడు రామోజీరావే ఆదుకున్నాడని ఇన్ సైడ్ టాక్..

రామోజీ రావు లేకుంటే.. బాహుబలి సినిమానే ఉండేది కాదు.. సినిమా నిర్మాణానికి ఫిలింసిటీ స్థలం, సౌకర్యాలు కల్పించారు. అంతేకాదు.. బడ్జెట్ లేక సతమతమువుతన్న నిర్మాతలకు వంద కోట్లకు పైగానే సమకూర్చి భరోసా కల్పించారు. అందుకే రామోజీరావు.. లేకుంటే సినిమానే లేదని రాజమౌళి వేదికపై అనేసి తన కృతజ్ఞత తీర్చుకున్నాడు.

To Top

Send this to a friend