పైసలు రావాలాంతే.. సంచలన నిర్ణయం..

సంచలన నిర్ణయాలకు మారు పేరుగా నిలిచిన కేసీఆర్.. ఏదైనా అమలు చేసే వరకు కూడా మూడో కంటికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. నయీం ఎన్ కౌంటర్ కానీ, చంద్రబాబు ఓటుకు నోటు కేసు కానీ బయట పడే వరకు ఎవ్వరికీ తెలియదు.. తెలిశాక అదో సంచలనమైంది..

కేసీఆర్ ఇలా క్రైం విషయంలోనే కాదు పథకాల విషయంలోనూ చాలా గోప్యత పాటిస్తారు. రైతులకు ఖరీఫ్ పెట్టుబడి కింద ఎరువుల కోసం రూ.4 వేలు ఇచ్చే పథకాన్ని కూడా ఎవ్వరూ ఊహించలేదు. కానీ సడన్ గా ప్రకటించి అమలు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో అనాదిగా ఉన్న ఒక వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించి వేసేందుకు కేసీఆర్ మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు.

1987లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడాక ఏపీ ముఖ్యమంత్రిగా తెలంగాణలో దోపిడీ వ్యవస్థకు మూల స్థంభాలుగా ఉన్న తాలుకాలు, పట్వారీల వ్యవస్థను రద్దు చేశారు. వాటి స్థానంలో మండలాలను ప్రవేశపెట్టారు. ఈ మండలాలు ఏపీ, తెలంగాణల్లో ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కానీ కేంద్రం నుంచి వచ్చే పథకాల అమలుకు ఈ మండలాలు ప్రతిబంధకంగా మారాయి.

కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే పలు సంక్షేమ పథకాలకు దేశవ్యాప్తంగా బ్లాక్ (అంటే మండలం స్థాయిలో ఉన్న ప్రాంతం) ను పరిగణలోకి తీసుకుంటుంది. మండలాల వ్యవస్థకు కేంద్రం ఆమోదం లేదు. తెలంగాణలో అందుకే పలు పథకాలకు నిధులు రావడం లేదు. బ్లాక్ లుగా వర్గీకరిస్తేనే నిధులు వస్తాయని ఇటీవల కేసీఆర్ కు కేంద్ర మంత్రులు స్పష్టం చేశారట.. దీంతో అనవసరంగా కేంద్రం నిధులు ఎందుకు కోల్పోవాలని కేసీఆర్ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. త్వరలోనే తెలంగాణలో మండలాలన్నీ రద్దు చేసి వాటి స్థానంలో మండలాలనే బ్లాక్ లుగా మార్చేందుకు ఫైల్ సిద్ధం చేయించారు. తద్వారా కేంద్రం నిధులను పొందేందుకు వీలు చిక్కుతుంది.

మండలాల రద్దుతో ఎంపీపీలు, ఎంపీటీసీ వంటి ప్రజాప్రతినిధుల పోస్టులన్నీ రద్దు అయ్యి బ్లాక్ అధ్యక్షుడు, బీపీటీసీ సభ్యులు కొత్తగా ఎన్నుకోబడతారు. ఇలా ఇప్పటికే కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేసి సంచలనం సృష్టించిన కేసీఆర్.. ఇప్పుడు కేంద్రం నిధుల కోసం మండలాల వ్యవస్థను రద్దు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

To Top

Send this to a friend