రాజమౌళి కెరీర్లో ‘బాహుబలి’కి ముందు బిగ్గెస్ట్ హిట్ ‘మగధీర’ అనే విషయం తెల్సిందే. రామ్ చరణ్‌కు ఇప్పటికి కూడా అదే బిగ్గెస్ట్ హిట్. ఇప్పటి వరకు ఆ సినిమా స్థాయిలో మరో సినిమాను కూడా చరణ్ చేయలేక పోయాడు. ఇక ఆ సినిమా గురించి ఇటీవల మళ్లీ వార్తలు జోరుగా వస్తున్నాయి. తాను మగధీర 100 రోజుల వేడుక ఫంక్షన్‌కు వెళ్లక పోవడం వెనుక పెద్ద కారణంగా ఉందని బాంబు పేళ్చిన జక్కన్న, అందుకు కారణం అల్లు అరవింద్ అని కూడా చెప్పేశాడు.
రాజమౌళికి ‘మగధీర’ సమయంలో అల్లు అరవింద్‌తో విభేదాలు తలెత్తాయి. ఆ కారణంగానే మెగా ఫ్యామిలీకి రాజమౌళి అప్పటి నుండి కాస్త దూరం మెయింటెన్ చేస్తూ వస్తున్నాడు. మళ్లీ ఇప్పుడు ఆ విషయమై జక్కన్న మాట్లాడుతూ ‘మగధీర’ చిత్రం కలెక్షన్స్ మరియు థియేటర్ల విషయంలో అల్లు అరవింద్ చేసిన పద్దతి నాకు నచ్చలేదు. డబ్బులిచ్చి మరీ ఎక్కువ థియేటర్లలో 100 రోజులు ఆడివ్వడం, కలెక్షన్స్‌ను కూడా తప్పుగా ప్రకటించడం వల్లే తాను మగధీర సినిమాకు సంబంధించిన వేడుకలకు దూరంగా ఉండిపోయాను అంటూ చెప్పుకొచ్చాడు.
రాజమౌళి చెప్పినదాని ప్రకారం చూస్తే ‘మగధీర’ చిత్రం కలెక్షన్స్ ఫేక్ అని తెలుస్తోంది. ప్రస్తుతం రికార్డుగా చెప్పుకుంటున్న మగధీర కలెక్షన్స్ ఫేక్ అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాను ముంచెత్తుతుంది. థియేటర్ల యాజమాన్యంను మ్యానేజ్ చేసి తప్పుడు కలెక్షన్స్‌ను ప్రకటించి రికార్డులు చూపించారు అంటూ యాంటీ మెగా ఫ్యాన్స్ ఇప్పుడు ఫైర్ అవుతున్నారు.
