ఆకాశం నుంచి అద్భుత చిత్రాలు..


భూగోళం చీకట్లో ఎలా ఉంటుంది. అందులో భారత దేశం ఎలా కనిపిస్తుందా అనే ఉత్కంఠ అందరిలోనూ ఆసక్తి కలిగిస్తుంది.. ఆ ఆసక్తి నాసా శాస్త్రవేత్తలలోనూ కలిగింది. అందుకే వారు తమ అత్యాధునిక ఉపగ్రహాలను ఉపయోగించి రాత్రిపూట చీకట్లో అమెరికా, ఇండియా ఎలా ఉన్నాయో ఫొటో తీయించారు. ఈ అరుదైన ఫొటోలను బుధవారం విడుదల చేశారు.

నాసా విడుదల చేసిన ఫొటోల్లో విద్యుత్ బల్బుల వెలుగులలో అమెరికా, ఇండియాలు చాలా బాగా కనిపించాయి. నాసా 2012లో తీసిన చిత్రాలను , 2016లో తీసిన చిత్రాలను కూడా విడుదల చేసి పోల్చి చూసింది. తాజాగా దేశాల సరిహద్దుల ప్రకారం అంతరిక్షం నుంచి భూమి చీకట్లో ఎలా ఉంటుందో మ్యాపులు విడుదల చేసింది. ఈ మ్యాపులు భారత్ కు సంబంధించిన చిత్రాలు అద్భుతంగా ఉండి వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

To Top

Send this to a friend