ఆగర్భ శత్రువులు మిత్రులయ్యారు..

-అప్పుడు కేటీఆర్ చేదు.. ఇప్పుడు తీపి.. రాధాకృష్ణ దోస్తీ..
తెలంగాణ ఏర్పడిన కొత్తలో తెలంగాణ సీఎం, కేటీఆర్ పై ఆంధ్రజ్యోతి పత్రిక, ఆ ఎండీ ఒక పెద్ద కథనాన్ని బ్లాస్ట్ చేశారు. అదీ ఏంటంటే జూబ్లిహిల్స్ టీఆర్ఎస్ నియోజకవర్గ నేత, కేటీఆర్ సన్నిహితుడు ఓ పెద్ద కుంభకోణంలో ఒడిషాలో అరెస్ట్ అయ్యాడు. ఈ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ కు ప్రమేయం ఉందంటూ ఆంధ్రజ్యోతి చానల్, పేపర్లలో పతాక శీర్షిక ప్రచురితం అయ్యింది. ఈ స్టోరీ ఏబీఎన్ చానల్ లో ప్రసారం కాగానే మంత్రి కేటీఆర్.. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు ఫోన్ చేశాడు.. ‘అంకుల్ .. జూబ్లిహిల్స్ టీఆర్ఎస్ ఇన్ చార్జి నాకు తెలుసు.. కానీ అతడి కుంభకోణానికి.. అరెస్ట్ కు నాకు లింకు పెట్టి పేపర్లో వేయొద్దని బతిమిలాడాడు.’ కానీ దీనికి ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ వినకపోగా పత్రికలో కేటీఆర్ పరువు తీసేలా పెద్ద కథనాన్ని తెల్లవారి వేసేశాడు..

ఆ తరువాత కేసీఆర్ అండ్ కో తెలంగాణ ఎమ్మెల్యేలను అవమానిస్తున్నారని టీవీ9ను , ఏబీఎన్ ను తెలంగాణలో నిషేధించడం.. రాధాకృష్ణ కేసీఆర్ తో సంధి చేసుకోవడం జరిగిపోయాయి. ఆ తర్వాత ప్రస్తుతం ఆంద్రజ్యోతి కేసీఆర్.. జీహెచ్ఎంసీలో గెలిపించాక కేటీఆర్ ను నెత్తిన పెట్టుకొని ఫోకస్ చేస్తూ కథనాలు రాస్తోంది.

అందుకే పాత మనసులు, కక్ష్యలు ఇప్పుడు వారి మధ్య తొలిగిపోయాయి. సహకారంలో ఆంధ్రజ్యోతి-కేసీఆర్-కేటీఆర్ లు క్విడ్ ప్రో క్రోలు పాటిస్తూ పరస్పర సహకరించుకుంటున్నారు. అందుకే ఒకప్పుడు తనపైనే కథనం వేసి కయ్యానికి కాలుదువ్విన ఏబీఎన్ రాధాకృష్ణ ఈరోజు ఉదయం పిలవగానే కేటీఆర్ పెద్ద మనసుతో.. రాజకీయా అవసరాలు గుర్తుతెచ్చుకొని పాత పగలు పక్కనపెట్టి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆంధ్రజ్యోతి బంపర్ డ్రా ను కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై తీశారు. కేటీఆర్ రాగానే రాధాకృష్ణ ఎదురెల్లి స్వాగతించడం. అంకుల్ బాగున్నావా అని కేటీఆర్ పలకరించడం.. ఇద్దరు కలిసి సరదాగా కార్ అండ్ గోల్డ్ రేసు డ్రా తీయడం.. ఓ గంట మాట్లాడుకోవడం జరిగిపోయాయి. ఇలా ఓ పెద్ద శత్రుత్వాన్ని మరిచిపోయి ఇద్దరు ఆగర్భ శత్రువులు ఒక్కటయ్యారన్నమాట..

To Top

Send this to a friend