ఆ నిజం రేవంత్ కు తెలిసిపోయిందా.?


తెలంగాణలో టీడీపీ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. తెలంగాణ టీడీపీ బాధ్యతలను రేవంత్ రెడ్డి చేతిలోకి తీసుకున్నారు. ఊరువాడ.. సమస్య పెద్దది చిన్నది అన్న తేడా లేకుండా తిరుగుతున్నాడు. జనాలతో కనెక్ట్ అవుతున్నాడు. సీఎం కేసీఆర్ ను, ఆయన కొడుకు కేటీఆర్ ను తిడుతున్నాడు.. జనం పై ఆసక్తి చూపుతున్నాడు. కానీ మీడియా పట్టించుకోవడం లేదు.. ఇటు కేసీఆర్ పట్టించుకోవడం లేదు. రేవంత్ ఎంత  తిడుతున్నా కూడా టీఆర్ఎస్ నాయకులు పట్టించుకున్నది లేదు.

వికారాబాద్ జిల్లా తాండూర్ లో శుక్రవారం జరిగిన టీడీపీ ప్రజాపోరు సభలో వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీ నాయకులు తమ మేనిఫెస్టోను ప్రకటించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణతో పాటు రేవంత్ రెడ్డి, పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి , రేవూరి ప్రకాష్ రెడ్డి తదితరులు హాజరై తీర్మానాలు ప్రవేశపెట్టారు.

రైతుల సమస్యలపై ఎజెండాను రేవంత్ రెడ్డి తలకెత్తుకున్నాడు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వాతావరణం అలుముకుంది. ఏపీ సీఎం చంద్రబాబు.. కేసీఆర్ లకు ఇప్పటికే సంకేతాలు వచ్చాయని తెలిసింది. అందుకే కేసీఆర్ బహిరంగ సభలు, ఉచిత ఎరువుల పథకాలతో దూసుకెళ్తున్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు సైతం ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు. ఆ విషయం తెలంగాణ టీడీపీ శ్రేణులకు కూడా చేరింది. అందుకే ఇప్పుడే తెలంగాణ టీడీపీ పోరుబాట పట్టింది. తాండూర్ లో టీడీపీ మేనిఫెస్టోను ప్రకటించింది. ముందస్తు ఎన్నికలకు రేవంత్ రెడ్డి సై అన్నాడు.

To Top

Send this to a friend