ఆ మహిళ వీడియో.. సంచలనం


ఒక్క వీడియో ఎందరిని కన్నీళ్లు తెప్పిచింది. కారణం ఏంటో ఎంత చెప్పినా తక్కువే.. కానీ ఒక దృశ్యకావ్యం ఇప్పుడు ఇంటర్నెట్ లో సంచలనం రేపుతోంది. ఎప్పుడూ సంతోషాన్ని పంచుకుంటాం.. కానీ ఆమె ఆవేదనను కూడా అర్థవంతంగా వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టింది. దానికి ప్రపంచమంతా గులాం అవుతోంది..

సాధారణంగా టీవీల్లో, ఇతర మాధ్యమాల్లో కనిపించే ప్రకటనలు ఆకర్షణీయంగా, ఆకట్టుకునేలా ఉంటాయి. చూడగానే ఆ ప్రొడక్ట్‌ను కొనాలనిపించేలా ఊరిస్తాయి. కానీ బంగ్లాదేశ్‌కు చెందిన ఓ యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాతో కన్నీళ్లు పెట్టిస్తోంది. మహిళలపై జరుగుతున్న దారుణాలకు సజీవ సాక్ష్యంలా నిలిచిన ఈ ప్రకటన చూసిన ప్రతి ఒక్కరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కేవలం 2.1 నిమిషాలు మాత్రమే ఉన్న ఈ యాడ్‌ ద్వారా నాగరిక సమాజంలో మహిళలపై జరుగుతున్న దారుణాలను కళ్లకు కట్టేలా చూపించారు. అందులో ఏముందంటే..

స్నేహితురాళ్లతో కలిసి బ్యూటీ క్లినిక్‌కు వచ్చిన ఓ యువతి తన జత్తును కత్తిరించమని చెబుతుంది. బ్యుటీషియన్ ఆమె జుత్తును చూసి ఆశ్చర్యపోతుంది. పొడవుగా, ఒత్తుగా అందంగా ఉందంటూ మెచ్చుకుంటూ, జుత్తు చివర్లు కత్తిరించి చాలా? అని అడుగుతుంది. దీంతో ఇంకా కత్తిరించాలని చెబుతుంది. మరికొంచెం కత్తిరించిన ఆమె ఇప్పుడు ఓకేనా మేడమ్ అని అడుగుతుంది. సరిపోదు.. ఇంకా కత్తిరించు అని యువతి చెప్పడంతో విసిగిపోయిన బ్యుటీషియన్ జత్తును బాబ్డ్‌హెయిర్‌లా కత్తిరించి ‘‘ఇప్పుడు చాలా బాగున్నారు మేడమ్’’ అంటూ అద్దంలో చూపిస్తుంది. దానికి ఆ యువతి స్పందిస్తూ ఒక చేత్తో జుత్తును పట్టుకుని, ‘‘ఇది పట్టుకుని ఎవరూ కొట్టకుండా ఉండేంత చిన్నగా కత్తిరించండి’’ అంటూ కన్నీళ్లు పెట్టుకోవడంతో అందరూ షాక్ తింటారు. బాధతో ఆమెవంక చూస్తారు. మహిళల నిస్సహాతను చూపించే ఈ యాడ్‌‌ ఇప్పటి వరకు 45 లక్షల మందితో కన్నీళ్లు పెట్టించింది.

To Top

Send this to a friend