ఆ జలపాతం నుంచి రక్తం ఏరులై


ఈ సృష్టిలో మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. శాస్త్రవేత్తలకు అంతుచిక్కనివి ఇంకా ఈ విశ్వంలో ఉన్నాయి. అలాంటిదే తూర్పు అంటార్కిటికాలోని ‘రక్త జలపాతం’. దీన్ని శాస్త్రవేత్తలు 1911లో గుర్తించారు. ఈ జలపాతం గుండా ఎర్రటి రక్తం లాంటి జలం పారుతూ ఉంటుంది. ఇది ఎక్కడిది ఎలా వస్తుందనే దానిపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు ఇప్పటికి ఆ విషయాన్ని నిగ్గు తేల్చారు.

అంటార్కిటికా ఖండం మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. ఎండాకాలంలో మాత్రమే అక్కడ జలపాతాలు పారుతాయి. మిగతా కాలాల్లో మంచు గడ్డ కట్టి కింద నుంచి పారుతూనే ఉంటుంది. అక్కడ మనుషులు జీవించడానికి కూడా సరిపడా వాతావరణం ఉండదు.. శాస్త్రవేత్తలు ఎండాకాలంలో మాత్రమే అక్కడ క్లిష్ట వాతావరణంలో ఉండి పరిశోధనలు చేస్తారు..

ఇలా ఈ రక్త జలపాతం గుట్టురట్టును ఇటీవలే శాస్త్రవేత్తలు నిగ్గు తేల్చారు. అక్కడి జలపాతంలో నీరు రక్తంలాగా రావడానికి కారణం అక్కడి నీటిలోని ఇనుము గాలితో కలిసి చర్య జరిపి ఎర్రటి ద్రవాన్ని ఏర్పరుస్తుంది. అది ప్రవాహంలామారి రక్తంలా మనకు కనిపిస్తుంది. నీటిలోని ఇనుమే ఇలా చర్యజరిపి రక్త ప్రవాహాలు సృష్టిస్తోందని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు.

To Top

Send this to a friend